పవన్ కల్యాణ్ తో గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ అనే సినిమా తీసి డిజాస్టర్ తెచ్చుకున్నాడు దర్శకుడు బాబి. ఆ తర్వాత ఎన్టీఆర్ తో జై లవకుశ చేసి మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఇప్పుడీ దర్శకుడు తన నెక్ట్స్ సినిమాను నాగచైతన్యతో ప్లాన్ చేస్తున్నాడు.
అన్నీ అనుకున్నట్టు జరిగితే బాబి దర్శకత్వంలో నాగచైతన్య సినిమా ఉంటుంది. ఎస్ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రామ్ తళ్లూరి నిర్మాతగా ఈ సినిమా వస్తుంది. ప్రస్తుతానికి హీరో, దర్శకుడు మధ్య స్టోరీ డిస్కషన్లు జరుగుతున్నాయి.
మొన్ననే శివ నిర్వాణ సినిమాకు ఓకే చెప్పాడు నాగచైతన్య. ఇది కాకుండా చేతిలో సవ్యసాచి, శైలజారెడ్డి అల్లుడు సినిమాలున్నాయి. సో.. బాబి సినిమాకు ఓకే చెప్పినప్పటికీ అది సెట్స్ పైకి రావడానికి ఇంకొంచెం టైమ్ పడుతుంది.
సర్దార్ గబ్బర్ సింగ్ టైపులోనే కంప్లీట్ మాస్ సబ్జెక్ట్ తో నాగచైతన్యను కలిశాడట బాబి. కానీ మాస్ సినిమా చేసిన ప్రతిసారి ఫ్లాప్ తెచ్చుకున్నాడు నాగచైతన్య. ఈసారి బాబి అయినా చైతూకు ఓ మాస్ హిట్ ఇస్తాడేమో చూడాలి.