యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా చేస్తున్న సినిమా ముఫై రోజుల్లో ప్రేమించటం ఎలా? ఈ చిన్న సినిమా నుంచి వచ్చిన తొలి పాట బాగా వైరల్ అయిపోయింది. చంద్రబోస్ రాసిన 'నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా' పాట బాగా ఫాపులర్ అయింది. సోషల్ మీడియాలో ఈ పాట బాగా వినిపిస్తోంది. చంధ్రబోస్ కు మంచి అప్లాజ్ వచ్చింది.
ఇప్పుడు ఇదే సినిమా నుంచి మరో పాటను విడుదల చేసారు. ఈ పాటను కూడా చంద్రబోస్ రాయగా, ఆర్మాన్ మాలిక్ ఆలపించారు. కాన్సెప్ట్ పాటలు అంటే చంద్రబోస్ అందెవేసిన చేయి. ఆయన ఈసారి ఈ పాట కోసం స్నేహాన్ని కాన్సెప్ట్ తీసుకున్నారు. ఇదేరా స్నేహం..ఇదేరా స్నేహం అంటూ సాగే ఈ పాటలో స్నేహాన్ని రకరకాలుగా వర్ణించారు.
ప్రదీప్ సరసన అమృత అయ్యర్ నటిస్తున్న అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. నీలి నీలి ఆకాశం పాట ఇప్పటికే మళ్లీ అనూప్ రూబెన్స్ కు కమ్ బ్యాక్ సాంగ్ అయింది. ఈ సినిమాను ఎస్వీ ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్వీ బాబు నిర్మిస్తున్నారు. మున్నా ఈ సినిమాకు రూపకల్పన ఛేస్తున్నారు. ఇప్పటి వరకు బుల్లి తెర నుంచి పెద్ద తెర మీదకు వచ్చిన వాళ్లు చాలా మంది ఎక్కువగా కామెడీ సినిమాలు చేసారు. కానీ దీనికి భిన్నంగా ప్రదీప్ మాచిరాజు ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఎంచుకోవడం విశేషం. పైగా పాటలకు ప్రాధాన్యత ఇవ్వడం ఇంకో విశేషం.