తను చిన్నప్పటి నుంచి తమిళ స్టార్ హీరో విజయ్ కు అభిమానిని అంటోంది రష్మిక. విజయ్ తన చైల్డ్ హుడ్ క్రష్ అని కూడా రష్మిక చెప్పడం గమనార్హం. ఇప్పటికీ విజయ్ అంతే ఆ క్రష్ కొనసాగుతున్నట్టుగా రష్మిక చెప్పుకొచ్చింది. భీష్మ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో రష్మిక ఈ విషయాన్ని చెప్పింది. ఆమె చెప్పిన విషయాన్ని విజయ్ అభిమాన సోషల్ మీడియా వర్గాలు వైరల్ చేస్తూ ఉన్నాయి. తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఉన్న రష్మిక తమ అభిమాన హీరోకి ఫ్యాన్ అని వారు ఆనందంగా షేర్ చేస్తూ ఉన్నారు.
ఇక రష్మిక చూపు తమిళ ఇండస్ట్రీ మీద కూడా ఉంది. ఇప్పటికే కార్తీ సినిమాలో ఈమె అక్కడ నటిస్తూ ఉన్నట్టుంది. 'బిజిల్' లో కూడా రష్మిక హీరోయిన్ గా నటించబోతోందని ప్రచారం జరిగింది. కానీ.. అది జరగలేదు. అప్పట్లో ఆ రూమర్ వచ్చింది. ఆ రూమర్ ను రష్మిక స్వయంగా ఖండించింది. అదే సమయంలో తను విజయ్ సినిమాలో నటించేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నట్టుగా రష్మిక వివరించింది. మరి ఇప్పుడు విజయ్ మీద ఈమె ప్రేమను కూడా వ్యక్తీకరించింది. ఇంతకీ విజయ్ ఈ ఫ్యాన్ కు ఎప్పుడు ఛాన్స్ ఇస్తాడో!