Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఇది అభిమానుల గొడవే అంటారా?

ఇది అభిమానుల గొడవే అంటారా?

‘‘..... సాయంత్రం కారులో బయల్దేరుతున్నానని, చికెన్ చేయాలని తనకు ఫోన్ చేసి చెప్పాడని, అంతలోనే కారు ఎక్కుతున్న పిల్లాడిని ఆపి, మాట్లాడాలని పది అడుగుల దూరం తీసుకెళ్లారని వినోద్ రాయల్ తల్లి అన్నారు. అక్కడ అతడితో ఏమీ మాట్లాడలేదని, కళ్లలో దుమ్ముకొట్టి పొడిచి చంపేశారని ఆమె విలపించారు.....’’

‘‘.... కర్ణాటకలోని కోలార్‌లో అవయవదానం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేశాడని అన్నారు. అదే అక్కడివాళ్లకు కంటగింపుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు....’’

ఇవీ కోలార్ లో హత్యకు గురైన పవన్ అభిమాని వినోద్ రాయల్ తల్లి చెప్పిన మాటలు. ఇవే మీడియాలో వచ్చినవి.

మరి ఈ హత్యను అభిమానుల మధ్య క్లాష్ గా ఎలా భావిస్తున్నారో అర్థం కావడం లేదు. అభిమానుల మధ్య క్లాష్ లు ఇలా వుండవు. ఆవేశంగా జరుగుతాయి. మాట మాట అనుకుని, చటుక్కున ఆవేశానికి లోనై, ఏదో ఒక దుర్ఘటన జరుగుతుంది. 1980 కి కాస్త అటు ఇటుగా కావచ్చు..అనకాపల్లిలో ఎన్టీఆర్ – కృష్ణ ఫ్యాన్స్ మధ్య చిన్న వాదన జరిగింది. గట్టిగా మైనారిటీ తీరిందో, తీరలేదో తెలియని వయస్సు కుర్రాడు ఆవేశంగా ఇద్దర్నో ముగ్గుర్నో పొడిచేసాడు. అదీ అభిమానుల మధ్య ఆవేశాలు, ఘర్షణ అంటే.

మరి కోలార్ సంఘటన ఎలా కనిపిస్తోంది. వినోద్ తల్లి మాటలే నిజమనుకుంటే, పక్కా ప్లాన్డ్ గా కనిపిస్తోంది. ఫంక్షన్ కు వెళ్లాడు..తిరిగి బయల్దేరాడు. చికెన్ వండమని తల్లికి ఫోన్ చేసి చెప్పాడు,. ఇంతలో ప్రత్యర్ధులో, ఇతర హీరోల ఫ్యాన్స్ నో వాహనం ఆపి, పక్కకు మాట్లాడుకుందాం రమ్మని పిలిచారు. హత్యకు పాల్పడ్డారు. అంటే సమ్ థింగ్ ఏదో వుంది. అది పాత కక్షలు కావచ్చు, ఈర్ష్యా ద్వేషాలు కావచ్చు.

ఈర్షాద్వేషాలు అని ఎందుకు అనాల్సి వస్తోంది అంటే, వినోద్ తల్లే అంటున్నారు. అవయువదానం కార్యక్రమాన్ని కోలార్ లో విజయవంతగా నిర్వహించాడని, అది అక్కడి వాళ్లకు కంటగింపుగా మారిందని ఆమె అన్నారు. మరోపక్క ప్రజలకు ఏదో చేయాలన్న ఉద్దేశం వినోద్ కు వుందని ఆమె అంటున్నారు. అంటే ఇక్కడ రాజకీయంగా ఎదగడం లేదా, ప్రజాదరణకు ప్రయత్నించడం వంటి ఏంగిల్ కూడా వున్నట్లు అనుమానం కలుగుతోంది.

ఇక్కడ పాయింట్ ఒక్కటే ఇది అభిమానుల మధ్య ఆవేశపూరిత ఘర్షణలా కనిపిస్తోంది. మీడియాలో వినిపిస్తోంది కానీ, దీనికి మించి మరేదో వుందన్న అనుమానమే. అదేమిటి? అన్నది పోలీస్ విచారణలోనే బయటకు వస్తుంది. రావాలి కూడా. అంతవరకు మీడియా పదే పదే ఇద్దరు హీరోలు..అభిమానులు..ఘర్షణ..అంటూ డిస్కషన్లు పెట్టడం, హడావుడి చేయడం వల్ల మరింత ఇబ్బందికరవాతావరణం ఏర్పడే ప్రమాదం వుంది. అసలు విషయం మరుగునపడిపోతుంది కూడా.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?