Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఇది పూరి..కాకా బాకానా?

ఇది పూరి..కాకా బాకానా?

మహేష్ తో పనిచేయడం డైరక్టర్లకు కిక్ ఇస్తుంది. మహేష్ తో పనిచేయడం సూపర్ అనేలా దర్శకుడు పూరి జగన్నాధ్ ఓ ప్రకటన విడుదలచేసారు. శ్రీమంతుడు సినిమా కోసం తాను కూడా చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నానని ఆయన ఆ  ప్రకటనలో పేర్కొన్నారు. ఇంకా చాలా చాలా అన్నారు.

దీని వైనం ఏమిటా అని టాలీవుడ్ లో డిస్కషన్ మొదలైంది. ఎందుకంటే. ఇటీవలే మహేష్-పూరి సినిమా ఫైనలైజ్ అయ్యే అవకాశాలున్నాయని వార్తలు వినవచ్చాయి. ఎందుకంటే శ్రీమంతుడు తరువాత బ్రహ్మోత్సవం లాంటి క్లాస్ సినిమా కాకుండా ఏదైనా మాస్ సినిమా చేయాలని మహేష్ భావిస్తున్నాడని వార్తలు వినవచ్చాయి. అందువల్ల ఈ చాన్స్ ను పూరి కొట్టేస్తాడా, వినాయక్ లైన్ లోకి వస్తాడా అని ఊహాగానాలు మొదలయ్యాయి.  ఇప్పుడు రేస్ లో ఓ అడుగు ముందుకు వేయాలని పూరి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఎప్పుడూ లేనిది, శ్రీమంతుడు సినిమా కోసం ఎదురుచూస్తున్నా అంటూ ప్రకటన కూడా చేసాడు. పూరి స్టయిల్ కూడా గురువు రామ్ గోపాల్ వర్మ లాంటిదే. ఎవరు ఏమనుకుంటేనేం..తాను అనుకున్నది చేసేస్తారు. అందుకే ఓ పక్క లోఫర్ సినిమా చేస్తూ, మెగాస్టార్ 150 వ సినిమా వుంటుందా వుండదా అన్న నేపథ్యంలో మహేష్ సినిమాకు గాలం వేస్తున్నట్లు కనిపిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?