చిరంజీవి 150 వ సినిమా అన్నది టాక్ ఆఫ్ ది ఇయర్ గా అలా డిస్కషన్లలో వుంటూనే వస్తోంది. ఆఖరికి ఈ లోగా చిరంజీవి కొద్ది సేపు బ్రూస్ లీ సినిమాలో కనిపించారు. ఇదిలా వుంటే ఇప్పుడు ఇక చిరంజీవి 150 లేదా 151 సినిమా చేసే మూడ్ లో లేరని గుసగుసలు వినిపిస్తున్నాయి. బ్రూస్ లీ సినిమా కోసం తాను వీలయినంత స్లిమ్ గా తయారై, అందంగా కనిపించినా, జనం నుంచి ఆశించన మేరకు స్పందన కరువయిందని చిరంజీవి కాస్త కలత చెందారని తెలుస్తోంది.
ఆరేళ్లకు పైగా గ్యాప్ తరువాత తను కనిపించానన్న జోష్ మేరకు ప్రేక్షకుల స్పందన లేదని చిరు భావిస్తున్నారట.బ్రూస్ లీ పరాజయం కన్నా, అసలు ఇది ఎందుకనేదే చిరు క్యాంప్ లో డిస్కషన్ పాయింట్ గా వుంది. అందుకే తాత్కాలికంగా కత్తి రీమేక్ నా, కొత్త కథనా, అన్నవన్నీ పక్కన పెట్టేసారట. ముందు రామ్ చరణ్ కు సరైన ప్రాజెక్టు సెట్ చేసి, అది పట్టాలకు ఎక్కిన తరువాత చిరు సంగతి ఆలోచిస్తారట.
అప్పటికి మళ్లీ కాస్త ఉత్సాహం వస్తే ఓకె లేదంటే లేదు. అలా కాకుండా అనుకోకుండా ఓ మాంచి కథ దొరికేసింది అనుకుంటే మాత్రం చూడొచ్చు. అయితే అలా అని కథల కోసం వెదుకులాట వద్దని అనుకుంటున్నారట.