ఇక ఆ సినిమా రిలీజవుద్దా?

మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ని హీరోగా పరిచయం చేస్తోన్న సినిమా అంటూ వైవిఎస్‌ చౌదరి ‘రేయ్‌’ మొదలు పెట్టినప్పుడే చాలా సందడి చేసాడు. అప్పటికే మెగా కుటుంబం నుంచి హీరోలు ఎక్కువైపోవడంతో…

మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ని హీరోగా పరిచయం చేస్తోన్న సినిమా అంటూ వైవిఎస్‌ చౌదరి ‘రేయ్‌’ మొదలు పెట్టినప్పుడే చాలా సందడి చేసాడు. అప్పటికే మెగా కుటుంబం నుంచి హీరోలు ఎక్కువైపోవడంతో మెగా అభిమానులు కూడా రేయ్‌పై పెద్దగా ఆసక్తి చూపించలేదు. 

చౌదరి మాత్రం ఎప్పటిలానే తన సినిమాపై ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేసాడు. గతంలో కూడా అతను తన దగ్గరున్న డబ్బు మొత్తం ఖర్చు చేసి సినిమాలు నిర్మించినా కానీ వాటిని ఎలాగోలా విడుదల చేసుకుని విజయాలు సాధించాడు. కానీ రేయ్‌ మాత్రం అతడి డబ్బుని హారతి కర్పూరంలా చేసేయడమే కాకుండా విడుదల కూడా కాకుండా స్టక్‌ అయిపోయింది. 

దీనిని కొనేవాళ్లు లేకపోవడంతో రేయ్‌ని ఎలా విడుదల చేయాలో తెలియక వైవిఎస్‌ చౌదరి నానా తంటాలు పడుతున్నాడు. అసలు ఈ పాటికే విడుదల కావాల్సిన ఈ సినిమా ఇంతవరకు సౌండ్‌ చేయకపోవడంతో ఇక ఇది విడుదల కాదని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. సాయి ధరమ్‌ తేజ్‌ నటించిన రెండో సినిమా పిల్లా నువ్వు లేని జీవితం ముందుగా విడుదలై దీనికి ఏ విధంగా అయినా ప్లస్‌ అవ్వాల్సిందే తప్ప లేదంటే రేయ్‌ రాదని కూడా అనేస్తున్నారు.