ఇక జనాల భుజాలపైనే బాధ్యత

కరోనా విషయంలో ప్రభుత్వాలు ఎంత చేయాలో అంతా చేసాయి. ఇంకా చేస్తున్నాయి. లాక్ డౌన్ మంత్రం అనేది అలా వాడుతూ పోయే వ్యవహారం కాదు. అటు ప్రభుత్వాల, ఇటు ప్రజల ఆర్థిక స్థితిగతులు అన్నీ…

కరోనా విషయంలో ప్రభుత్వాలు ఎంత చేయాలో అంతా చేసాయి. ఇంకా చేస్తున్నాయి. లాక్ డౌన్ మంత్రం అనేది అలా వాడుతూ పోయే వ్యవహారం కాదు. అటు ప్రభుత్వాల, ఇటు ప్రజల ఆర్థిక స్థితిగతులు అన్నీ చిన్నాభిన్నం అవుతాయి. అందుకే ఇక చేయగలిగింది చేసాం, ఇంతకన్నా ఏం చేయలేం అన్నట్లుగా ప్రభుత్వాలు లాక్ డౌన్ ను మెలమెల్లగా ఎత్తివేయడం ప్రారంభించాయి.  ఇక మిగిలింది జిల్లాకు జిల్లాకు జనాలు తరలి వెళ్లడం, అలాగే రాష్ట్రానికి రాష్ట్రానికి తరలి వెళ్లడం.

కార్యాలయాలు ప్రారంభమవుతున్నాయి. దుకాణాలు తెరుచుకుంటున్నాయి. ఆటోలు తిరగడం మొదలయింది. ఇక ఇప్పుడేమిటి? పరిస్థితి. కరోనా కల్లోలంపై ప్రభుత్వాల బాధ్యత ఇప్పుడు జనం భుజల మీదకు వచ్చింది. ఏమాత్రం తేడా వచ్చినా మళ్లీ కరోనా మొదటికి వచ్చేస్తుంది.  అలా జరిగితే మళ్లీ నియంత్రించడం అన్నది అంత సులువు కాదు. దేశం అతలాకుతలం అయిపోతుంది.

జనాలు మాస్కలు మానేసి, శానిటైజర్లు మానేసి ఎవరి ఇష్టానికి వారు ప్రవర్తిస్తే పరిస్థితి దారుణంగా మారే ప్రమాదం వుంది. ప్రభుత్వాలు ఎంతకాలం పట్టుకుని కూర్చోగలవు. అందుకే ఏమయితే అయిందని సడలింపు కార్యక్రమం చేపట్టాయి. దీన్ని ప్రజలు అలుసుగా తీసుకుంటే మాత్రం పరిస్థితి విషమించే ప్రమాదం వుంది.  అలా జరగకూడదు అంటే లాక్ డౌన్ లో కన్నా మరింత జాగ్రత్తగా వుండాల్సి వుంది జనాలు ఇప్పుడు.

జగన్ కి స్పెషల్ థాంక్స్ చెప్పిన నవీన్ పట్నాయక్