మెగా ఫ్యామిలీ ఫంక్షన్ల పాస్ ల కోసం అర్రులు చాచకూడదని పవన్ ఫ్యాన్స్ ఫిక్సయ్యారా? ఈ మేరకు కబుర్లు వినిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న జరిగిన బ్రూస్ లీ ఫంక్షన్ వ్యవహారమే ఇందుకు దారి తీసిందని వినికిడి. చిరంజీవీ ఫ్యాన్స్ నాయకుడు స్వామినాయుడు ద్వారా ఈ సారి చాలా తక్కువ మందికి పాస్ లు అందాయట.
కోస్తా జిల్లాల నుంచి వచ్చిన ఫ్యాన్స్ తమకు తెలిసినవారిని, సినిమాలతో సంబంధం వున్నవారిని పట్టుకుని, ఏదో విధంగా పాస్ లు సంపాదంచుకున్నారట.ఈ సారి ఫ్యాన్స్ కోటా పాస్ లు చాలా వరకు తగ్గించారని, అది కూడా కేవలం పక్కాగా చరణ్ లేదా చిరు ఫ్యాన్ అయితేనేం ఇచ్చారని, పవన్ ఫ్యాన్ కూడా అని ఏమాత్రం తెలిసినా, లేవని మొండి చేయిచూపారని వినికిడి. ఫంక్షన్ లో అనవసరపు గడబిడను అవాయిడ్ చేయడానికే ముందు జాగ్రత్తగా ఇలా చేసారంటున్నారు.
అలాగే చిరు పుట్టిన రోజు వేడుకల్లో తాను మాట్లాడిన దాన్ని పట్టుకుని, మళ్లీ ఈ ఫంక్షన్ లో ఎవరైనా తనను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారనే నాగబాబు హాజరు కాలేదన్న టాక్ వినిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో, ఫ్యాన్స్ రాకుంటే సందడే వుండదని, ఇకపై వాళ్లంతట వాళ్లు పాస్ లు ఇవ్వడమో, పంపడమో చేస్తే తప్ప, తమంతట తాముగా వెళ్లి అడగకూడదని పర్టిక్యులర్ గా పవన్ ఫ్యాన్స్ అనుకుంటున్నారట.
మరి ఎంతవరకు ప్రభావం చూపిస్తుందో తెలియాలంటే, మరో ఫంక్షన్ జరగాలి. దానికి చాలా కాలం టైమ్ వుంది.