ఎన్నోహిట్ లు ఇచ్చాడు..కొన్ని రికార్డులు స్వంత చేసుకున్నాడు. కానీ రామ్ చరణ్ కు ఒక్క కోరిక మాత్రం వుండిపోయింది. ఓవర్ సీస్ మార్కెట్ ను కొల్ల గొట్టాలన్నది. అక్కడ వన్ మిలియన్ క్లబ్ లో చేరాలని. భలేభలే మగాడివోయ్ లాంటి చిన్న సినిమా చేరింది కానీ, రామ్ చరణ్ కు ఆ ఫీట్ కావడం లేదు.
ఇన్నాళ్లకు ఆ అవకాశం బ్రూస్ లీ రూపంలో వచ్చింది. శ్రీను వైట్ల దర్శకుడు కావడమే దీనికి ప్రధాన కారణం. శ్రీనువైట్ల ఆగడు లాంటి ఫ్లాప్ ఇచ్చి వుండొచ్చు. కానీ ఓవర్ సీస్ లో ప్రేక్షకులకు ఆయన సినిమాలంటే ఓ క్రేజ్ వుంది. ఇప్పుడు కోనవెంకట్, గోపీ మోహన్ మళ్లీ శ్రీను వైట్లతో కలియడం, చాన్నాళ్ల తరువాత చిరంజీవి స్క్రీన్ మీద కనిపించడం వంటి ప్లస్ పాయింట్లు తోడయ్యాయి.
దీంతో రామ్ చరణ్ ఓవర్ సీస్ మార్కెట్ లో తన ప్లేస్ ఒకటి క్రియేట్ చేసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. పైగా ఈ సినిమాకు భారీగానే ప్రీమియర్ షోలు, రెగ్యులర్ షోలు ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికే ఓవర్ సీస్ హక్కులు కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్ వాటిని మంచి రేటుకు అమ్మేసి, యాభై లక్షల మేరకు లాభం చేసుకున్నట్లు తెలుస్తోంది. కొనుక్కున్నవాళ్లు ఎక్కడిక్కడ వీలయినన్ని ఎక్కువ ప్రీమియర్ షోలు వేసే ప్రయత్నాల్లో వున్నారు. సో, దీనివల్ల ప్రీమియర్ షో ఎమోంట్ బాగా వచ్చే అవకాశం వుంది. సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ బజ్ వచ్చినా, ఇక కలెక్షన్లు కొల్లగొడుతుంది. చరణ్ కోరిక తీరుతుంది.