ఇక నో మోర్ ‘పవర్ స్టార్’ ?

టాలీవుడ్ లో ఓ కొత్త గ్యాసిప్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ను అభిమానులు ఉత్తేజంగా పిలుచుకునే పవర్ స్టార్..పవర్ స్టార్..అనే సౌండ్ ఇంక వినిపించదు అన్నదే ఆ గ్యాసిప్.  Advertisement తన పేరు ముందు…

టాలీవుడ్ లో ఓ కొత్త గ్యాసిప్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ను అభిమానులు ఉత్తేజంగా పిలుచుకునే పవర్ స్టార్..పవర్ స్టార్..అనే సౌండ్ ఇంక వినిపించదు అన్నదే ఆ గ్యాసిప్. 

తన పేరు ముందు ఇకపై పవర్ స్టార్ అన్న పదాన్ని వాడవద్దని పవన్ కళ్యాణ్ నే తన సినిమా జనాలకు సూచించారని తెలుస్తోంది. నిజంగా మెగాస్టార్ ఎంత పవర్ ఫుల్ నో, ఈ పవర్ స్టార్ ను కూడా అంతే పవర్ ఫుల్ ప్రీ ఫేజ్. 

సినిమా అడియో ఫంక్షన్లు ఎవరివైనా పవర్ స్టార్ నినాదాలు మిన్నుముట్టేవి. ఈ వ్యవహారం నుంచే బాహుబలి సినిమాలో సీన్ కు శ్రీకారం చుట్టానని కథకుడు, విజయేంద్రప్రసాద్ స్వయంగా చెప్పారు. అంతటి పవర్ ఫుల్ నినాదాన్ని ఇక వినిపించకుండా చేయాలని పవన్ ఎందుకు అనుకుంటున్నట్లో?

ఓ పరిపూర్ణ రాజకీయ నాయకుడిగా ఎదగడానికి ఈ పదం అడ్డం పడుతోందని ఏమైనా భావిస్తున్నారా? కానీ మాస్ లీడర్ గా ఎదగడానికి ఇదే ఉపకరిస్తుంది. మరి దాన్ని వదిలేయాలని ఎందుకు అనుకుంటున్నారు. ఒక విధమైన వైరాగ్యం లేదా పరిత్యాగం అనుకోవాలా?