ఇకనైనా బేరాలు ఫిక్సవుతాయా?

హమ్మయ్య, మెగా స్టార్ 150వ సినిమా మీద నిర్మాత రామ్ చరణ్ నే క్లారిటీ ఇచ్చేసారు.. సంక్రాంతి విడుదల కన్ ఫర్మ్ అని.  నిజానికి ఈ సినిమా సంక్రాంతికి వస్తుందా? రాదా? అన్న అనుమానలైతే…

హమ్మయ్య, మెగా స్టార్ 150వ సినిమా మీద నిర్మాత రామ్ చరణ్ నే క్లారిటీ ఇచ్చేసారు.. సంక్రాంతి విడుదల కన్ ఫర్మ్ అని.  నిజానికి ఈ సినిమా సంక్రాంతికి వస్తుందా? రాదా? అన్న అనుమానలైతే పెద్దగా లేవు. కానీ ఎందుకు ఇప్పుడు రామ్ చరణ్ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఈ సినిమా అప్ డేట్స్ ఎప్పటికప్పుడు తెలుస్తూనే వున్నాయి. నిన్నొ,మొన్నో మెగాస్టార్ న్యూలుక్ అంటూ రెండు ఫొటోలు వదిలారు కూడా.

విషయం ఏమిటంటే, ఖైదీ నెం.150 వ సినిమాకు భారీ అమ్మకాలు జరగాలని నిర్మాత, హీరో కోరుకుంటున్నారు. బేరాలకు లోటేం లేదు. చాలా మందే అడుగుతున్నారు. కానీ రేట్ల దగ్గరే సెట్ కావడం లేదని వినికిడి. వీళ్ల కేమో, బాహుబలి కి కాస్త అటు ఇటుగా రేట్లు కావాలి. వాళ్లకేమో, బ్రూస్ లీ కళ్ల ముందు కదిలి భయంపైగా ఇప్పుడు బేరం సెటిల్ చేస్తే అడ్వాన్స్ లు చేతిలో పెట్టాలి. విడుదలయ్యే వరకు దానికి వడ్డీ లెక్క వుంటనే వుంటుంది. . దాంతో రేట్లు సెట్ కావడం లేదని వినికిడి. 

అందుకే మరోసారి క్లారిటీగా సంక్రాంతికి వస్తోందని చెబితే, ఇక వ్యవహారం దగ్గరకు వచ్చేసిందని, బయ్యర్లు అడుగు ముందుకు వేస్తారు. బేరాలు సెటిల్ అవుతాయి. ఇదే రామ్ చరణ్ ఇప్పుడు క్లారిటీ ఇవ్వడం వెనుక అసలు విషయం అంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.