Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఇకనైనా త్రివిక్రమ్ మాట్లాడతారా?

ఇకనైనా త్రివిక్రమ్ మాట్లాడతారా?

సాధారణంగా ఏ సినిమా విడుదల ముందయినా దర్శకుడు మీడియతో మాట్లాడడం కామన్. విడివిడిగానో.. కలివిడిగానో. కానీ అ..ఆ ముందు దర్శకుడు త్రివిక్రమ్ అలా మాట్లాడలేదు. కారణం..ఓవర్ సీస్ కు డిస్క్ లు వెళ్లాక కూడా ఆయన తుది మెరుగులు దిద్దడమే అన్నది యూనిట్ టాక్. 

మే ఫస్ట్ వీక్ లో విడుదలకు రెడీ అయిపోయి, 24, బ్రహ్మోత్సవం సినిమాల ఫుణ్యమా అని జూన్ లోకి వచ్చిన సినిమా కదా? ఇప్పుడు తుదిమెరుగులు ఏమిటి అన్నది సందేహం. అది కాదు..ఈ సినిమా గురించి విడుదలయిన తరువాతే మాట్లాడాలనుకుంటున్నారు త్రివిక్రమ్.. ముందు ఆయన పెదవి విప్పాలనుకోవడం లేదు అన్నది ఇంకో సమాధానం. 

మరి ఇప్పుడు విడుదలయిపోయింది.. పాజిటివ్ టాక్ వచ్చేసింది. పాజిటివ్ సమీక్షలు వచ్చాయి. ఇక నైనా మీడియా ముందుకు వస్తారా? ఏమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?