Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అ..ఆ రిజల్ట్ ఓకె కానీ..?

అ..ఆ రిజల్ట్ ఓకె కానీ..?

ఆ..ఆ టీమ్ టెన్షన్ దిగిపోయింది. ఫుల్ పాజిటివ్ బజ్ వచ్చింది. సమారు ముఫై కోట్ల మేరకు బిజినెస్ చేసారు. బయ్యర్లు సేఫ్ అయిపోతారని ఫస్ట్ డే టాక్ మాత్రమే కాదు, కలెక్షన్లు కూడా చెప్పాయి. పైగా నిర్మాత చినబాబు ఈ సినిమా బాగా రీజనబుల్ రేట్లకు ఇవ్వడమే కారణం. ఫర్ ఎగ్జాంపుల్ సీడెడ్ 3.6 కోట్లకు ఇచ్చారు. తొలి రోజే 70 నుంచి 80 లక్షల వరకు వచ్చింది. శాటర్ డే, సండే కూడా ఆ రేంజ్ లో వుండే అవకాశం వుంది. అంటే వీకెండ్ వేళకు పెద్దగా భయపడక్కరలేదు అనే జోన్ కు వెళ్లిపోతారు. 

మిగిలిన ఏరియాలన్నీ కోటి నుంచి మూడు కోట్ల లోపే. ఒక్క నైజాం మాత్రమే ఎనిమిదిన్నర కోట్లు. నైజాం మార్కెట్, హైదరాబాద్ అర్బన్ ఆడియన్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఓ రెండు అదనంగా వస్తుందని కొనుక్కున్న దిల్ రాజు ఫీలింగ్. ఓవర్ సీస్ సరేసరి. అంతా బాగానే వుంది. మరి ఇంతకీ నిర్మాత చినబాబు సంగతి? ఎందుకంటే ఈ సినిమాకు ముఫై కోట్లు ఖర్చయింది. త్రివిక్రమ్, నితిన్ పారితోషికాలు కాకుండా. శాటిలైట్ ఇతరత్రా అన్నీ కలుపుకుని ముఫై అయిదు నుంచి ముఫై ఆరుదాకా వచ్చిందని వినికిడి. 

అంటే అక్కడికి ఇంకా ఓ ఆరు డెఫిసిట్ వుంటుంది. త్రివిక్రమ్ పక్కాగా తన పది కోట్లు తాను తీసుకుంటే. అలా కాదు, సినిమాకు ఎక్కువ ఖర్చు అయింది కాబట్టి తగ్గించుకుంటే చినబాబు సేఫ్ అవుతారు. లేదూ బాబు బంగారం, ప్రేమమ్ రెండు సినిమాలు వెనకాల వున్నాయి కాబట్టి, బయ్యర్లు దయతలచి, రిటర్న్ లు ఏమన్నా ఇచ్చినా ఓకె. లేదూ అంటే మంచి సినిమా తీసినా, ప్రశంసలు దక్కినా, లాభం మాత్రం వుండదు. 

నిజానికి సినిమాకు 17, పారితోషికాలకు 13 వెరసి 30 సినిమా చేద్దాం అన్నది చినబాబు ప్లాన్. కానీ త్రివిక్రమ్ స్టయిల్ లో ఈ సినిమా ఇంతకు డేకింది. 60 రోజులు షెడ్యూలు అనుకుంటే 95 రోజులకు చేరింది. లేదూ అంటే ఆరేడు కోట్ల టేబుల్ ప్రాఫిట్ సినిమా ఇది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?