Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఇంటిలిజెన్స్ అధికారిగా మహేష్

ఇంటిలిజెన్స్ అధికారిగా మహేష్

బ్రహ్మోత్సవం వ్యవహారం ముగిసిపోయింది. మహేష్ బాబు తన తరువాతి సినిమా వ్యవహారాలను స్పీడప్ చేసాడు. మురగదాస్ తో నిర్మించే సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు స్పీడ్ గా సాగుతున్నాయి. కాస్టింగ్ ఫిక్సయిపోయింది. పరిణీతి హీరొయిన్ అన్న సంగతి తెలిసిందే. 

హిందీ గజని, తుపాకి సినిమాలకు ఆర్ట్ డైరక్టర్ గా పనిచేసిన సునీల్, ఫేమస్ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్, మ్యూజిక్ డైరక్టర్ హారిష్ జయరాజ్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు. హారిష్ అప్పుడే ఓ మాంచి ట్యూన్ సెట్ చేసి ఇచ్చేసాడు. అన్నపూర్ణ స్టూడియాలో విశాలమైన ఇంటిలిజెన్స్ ఆఫీసు సెట్ వేయబోతున్నారు. 

దీంట్లో రా లాంటి కౌంటర్ ఇంటిలిజెన్స్ సంస్థ అధికారిగా మహేష్ కార్యాలయం కూడా వుంటుంది. దాన్ని కూడా డిజైన్ చేస్తున్నారు. వన్ వీక్ ప్రొడక్షన్ డిజైన్ కు సంబంధించి ముంబాయిలో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఆ వెంటనే ఇక పనులు మరింత స్పీడందుకుంటాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?