ఇకనైనా బయటకు వస్తారా?

ఏ సినిమాకు అయినా రెండు రకాల ప్రొమోషన్లు వుంటాయి. ప్రీ రిలీజ్, పోస్ట్ రిలీజ్. సాహో సినిమాకు ప్రీ రిలీజ్ పబ్లిసిటీ లేటుగా స్టార్ట్ చేసినా బాగానే చేసారు. ఫుల్ పీక్స్ కు తీసుకెళ్లారు.…

ఏ సినిమాకు అయినా రెండు రకాల ప్రొమోషన్లు వుంటాయి. ప్రీ రిలీజ్, పోస్ట్ రిలీజ్. సాహో సినిమాకు ప్రీ రిలీజ్ పబ్లిసిటీ లేటుగా స్టార్ట్ చేసినా బాగానే చేసారు. ఫుల్ పీక్స్ కు తీసుకెళ్లారు. హీరో ప్రభాస్ దేశం ప్రధాన నగరాలు అన్నీ పర్యటించి, ప్రచారం అదరగొట్టేసారు. తెలుగునాట కూడా లాస్ట్ మినిట్లో బాగానే చేసారు. మొత్తానికి ఆ ప్రభావం సినిమా ఓపెనింగ్స్ మీద బాగానే కనిపించింది.

అయితే సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చిన తరువాత అసలు ప్రచారం అన్నదాన్నే వదిలేసారు. సాధారణంగా ఇలాంటి టాక్ వచ్చినపుడే పబ్లిసిటీ మరింత ఎక్కువ వుండాలి. టాలీవుడ్ లో సినిమా ఫ్లాప్ అయితే సాయంత్రానికి సక్సెస్ మీట్ షురూ అవుతుంది. అలాంటిది సినిమా యావరేజ్ అన్న టాక్ వచ్చినా, కలెక్షన్లు బాగానే వున్నపుడు సాహో యూనిట్ ఎందుకు అన్నీ ఆపేసి సైలంట్ అయిందో తెలియదు.

సరే, సినిమా రిలీజ్ కు మందుచేసిన పబ్లిసిటీ ఊపు ఫస్ట్ వీకెండ్ వరకు కాసేస్తుంది, ఆ తరువాత చూసుకుందాం అనుకున్నారేమో? ఫస్ట్ వీకెండ్ అయిపోయింది. వినాయక చవితి అయిపోయింది. మంగళవారం వచ్చింది. నార్మల్ రేట్స్ వచ్చాయి. మరి ఆ సంగతి అయినా జనాలకు తెలియాలి కదా? ఫస్ట్ వీక్ మొత్తం ఒకటే రేట్లు వున్నాయి అనుకునే ప్రమాదం వుంది కదా? ప్రస్తుతానికి ముఫై అయిదు నుంచి నలభై వరకు వున్న ఆక్యుపెన్సీని పెంచే ప్రయత్నం చేసుకోవాలి కదా?

ఇప్పటి వరకు డైరక్టర్ మీడియా ముందుకురాలేదు. ప్రభాస్ మాదిరిగా ఇంటర్వూలు ఇవ్వలేదు. కనీసం ఆ ముచ్చట అయినా తీర్చితే బాగుంటుంది కదా? సినిమాకు ప్రచారం కూడా వస్తుంది. ఎంతసేపూ కలెక్షన్ల పోస్టర్లు తప్ప, వేరే వ్యవహారం చేపట్టే ఆలోచన చేస్తున్నట్లు కనిపించడం లేదు. హీరో ఎక్కడో.. డైరక్టర్ ఇంకెక్కడో… నిర్మాతలు ఇప్పుడే కాదు, ఎప్పుడూ సైలంట్ గా వుంటారు. ఇలా అయితే ఎలా?

జగన్ ఎప్పూడూ జాగ్రత్తగా ఉండాలి సుమా!