''…ఆంధ్రప్రదేశ్‌లో జంపింగ్‌లు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా టీడీపీ నుంచి పలువురు బీజేపీ, వైసీపీలలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. వైసీపీ నుంచి జంపింగ్‌లు షురూ అయ్యాయి. తాజాగా.. వైసీపీ రెబల్ అభ్యర్థి దొన్ను దొర ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. దీంతో వైకాపాకు షాక్ తగిలినట్లు అయింది. గత ఎన్నికల్లో వైసీపీ రెబెల్ అభ్యర్ధిగా పోటీచేసిన దొన్ను దొర రెండోస్థానంలో నిలిచారు. దొన్నుదొర టీడీపీ కండువా కప్పుకోవడం వైసీపీకి షాక్ అనే చెప్పాలి.,,''
ఇదీ వార్త..
ఈవార్త చూసి ఏమనుకోవాలి? నిజంగా ఇది వైకాపాకు షాక్ ఏనా? పార్టీకి రెబల్ గా పోటీ చేసాడంటేనే, పార్టీని వదిలేసినట్లు కదా? పైగా జగన్ లాంటి నేత ఒకసారి రెబల్ గా మారిన వాళ్లను మళ్లీ దగ్గరకు రానిస్తాడా? మరి అప్పుడు ఏది గత్యంతరం? మరో పార్టీలో చేరడమే కదా? మరి దీన్ని పట్టుకుని, వైకాపాకు ఏదో జరిగిపోయింది. షాక్ కొట్టేసింది. వలసలు షురూ అయ్యాయి అని రాసుకుని మురిసిపోవడం అంటే ఏమనాలి?
ఇది ఒకరకం పచ్చని షాక్ అనుకోవాలేమో?