Advertisement

Advertisement


Home > Politics - Gossip

మంత్రుల పనితీరుపై జగన్ ఫీడ్ బ్యాక్

మంత్రుల పనితీరుపై జగన్ ఫీడ్ బ్యాక్

వైసీపీ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తవుతోంది. ఈ 100 రోజుల పాలనపై సహజంగానే అందరూ సమీక్షలు, స్పందనలు అంటూ హడావిడి చేస్తుంటారు. సీఎం జగన్ కూడా 100 రోజుల పాలనపై ఓ రిపోర్ట్ తెప్పించుకున్నారు. మంత్రుల పనితీరుని మదింపు చేశారు. ఈ రివ్యూని దగ్గరపెట్టుకుని త్వరలో జగన్ మంత్రిమండలితో ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. ఏ శాఖ పరిధిలో ఏయే పనులు మొదలయ్యాయి, ఎవరు ఎంత స్పీడ్ గా ఉన్నారు, ఎవరి పనితీరుపై విమర్శలు వచ్చాయి.. అధికారం, పదవి వచ్చాక రిలాక్స్ అయినవాళ్లు ఎంతమంది, మీడియా ముందు మరీ ఓవర్ గా రియాక్ట్ అవుతున్నవారు ఎవరు.. ఇలా ఓ లిస్ట్ తయారు చేయించారు ముఖ్యమంత్రి.

ఓవరాల్ గా ప్రతి మంత్రినీ కూర్చోబెట్టి వారి పనితీరు వారికే వివరించే కార్యక్రమం ఒకటి ప్లాన్ చేశారు జగన్. అయితే జగన్ సమీక్షలో దాదాపుగా మంత్రులందరికీ మంచి మార్కులే పడ్డాయి. పాలన మొదలైనరోజు నుంచీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు జగన్ ఒకటే కండిషన్ పెట్టారు. అధికారుల పనుల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని సూచించారు. దీంతో సహజంగానే తప్పుల సంఖ్య తగ్గిపోయింది. అందులోనూ రెండేళ్ల తర్వాత మంత్రిమండలిలో మార్పులుంటాయని స్వయంగా జగన్ చెప్పడంతో మంత్రులంతా అలెర్ట్ గా ఉన్నారు. అతిగా ప్రవర్తించకపోవడం వల్లనే మంత్రులకు ఎక్కడా మరకలంటుకోలేదు.

అయితే ప్రతిపక్షాల విమర్శలను కాచుకోవడంలో మాత్రం మంత్రుల మధ్య సమన్వయ లోపం ఉందని జగన్ ఓ నిర్థారణకు వచ్చారు. ఇదే విషయంపై వీరందరికీ క్లాస్ తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. తాను విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు, వరద నివారణ చర్యలు సరిగా చేపట్టినా.. ప్రతిపక్షాల నోటికి సరిగా బదులు చెప్పలేకపోయారని, ఈ విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంకాస్త అలెర్ట్ గా ఉండాలని జగన్ భావిస్తున్నారట. జిల్లా ఇంచార్జిల విషయంలో కూడా కాస్త సర్దుబాట్లు కష్టమవుతున్నాయనే విషయం ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది.

జిల్లా ఇంచార్జి మంత్రులుగా ఉన్న కొంతమందికి స్థానిక మంత్రులతో పొసగడంలేదు. కొన్ని జిల్లాల సమీక్షల్లో ఈ విషయం బైటపడినా మీడియాకి ఎక్కకపోవడం గమనార్హం. మొత్తమ్మీద అంతర్గత సర్వేతో మంత్రుల పనితీరుపై జగన్ సంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. తప్పులు జరిగే అవకాశాలన్నిటినీ జగన్ ముందే కట్ చేయడం వల్ల ఎక్కడా ఎవరికీ అవినీతి మకిలి అంటలేదని అంటున్నారు పార్టీ నేతలు. ఇదే సమీక్షలో మంత్రుల నుంచి కూడా తన పనితీరు, వ్యవహారశైలిపై ఫీడ్ బ్యాక్ తీసుకోబోతున్నారు ముఖ్యమంత్రి.

జగన్ ఎప్పూడూ జాగ్రత్తగా ఉండాలి సుమా!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?