కిట్టని వాళ్లు అనేమాట ఇదే. లోకేష్ వల్లే తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందని. ఆయనే ఆ పార్టీకి ఐరన్ లెగ్ అని. గతంలో రోజాకు ఇలాంటి పేరే వుండేది. ఆమె ఏ పార్టీలో వుంటే ఆ పార్టీకి ఆమె ఐరన్ లెగ్ అని. కానీ అదికాస్తా ఇప్పుడు మారింది. లోకేష్ వ్యవహారం కూడా భవిష్యత్ లో మారవచ్చు.
ఆ సంగతి అలావుంచితే, లోకేష్ ఇలా కాలుపెడితే అలా అక్కడ ఓ లీడర్ పార్టీ వదిలి వెళ్లిపోయాడు అంటూ రాజకీయ వర్గాల్లో కామెంట్లు వినిపిస్తున్నాయి. లోకేష్ బాబు ఎన్నికల అనంతరం ఎక్కువగా స్మార్ట్ ఫోన్, ట్విట్టర్ కే అంకితమై వుండిపోయారు. కానీ తొలిసారి బయటకు వచ్చి, విశాఖజిల్లా నర్సీపట్నం వెళ్లారు. అక్కడ బైక్ ర్యాలీలో పాల్గొనడానికి ఆయన వెళ్లారు.
కానీ తీరాచేసి అక్కడ సీనియర్ లీడర్ సన్యాసిపాత్రుడు తెలుగుదేశం పార్టీని అదే సమయంలో వీడుతున్నట్లు ప్రకటించారు. తాను ఏ పార్టీలో చేరేది భవిష్యత్ లో ప్రకటిస్తా అన్నారు. మాజీమంత్రి, తెలుగుదేశం సీనియర్ లీడర్ అయ్యన్నపాత్రుడికి ఈ సన్యాసిపాత్రుడు సోదరుడు కావడం విశేషం. ఈ లెక్కన చూస్తుంటే లోకేష్ మళ్లీ వెంటనే ఇంకెక్కడికీ వెళ్లరేమో? అన్నది పొలిటికల్ సర్కిళ్లలో వినవస్తున్న కామెంట్.