కొన్ని హ్యాండ్ లను గోల్డెన్ హ్యండ్ లు అనాలేమో? ముఖ్యంగా చిన్న సినిమాలకు ఇలాంటి గోల్డెన్ హ్యాండ్ లు బాగా వర్కవుట్ అవుతాయేమో? నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు వ్యవహారం చూస్తుంటే అలాగే వుంది. ఫిదా సంగతి కొత్తగా చెప్పక్కర్లేదు. మరో చిన్న సినిమా ఆనందోబ్రహ్మ సంగతి అలాగే వుంది.
ఈ సినిమాకు నైజాం, వైజాగ్ ల్లో దిల్ రాజే పంపిణీ దారుడు. సినిమాను నిర్మాతలు పెద్దగా అమ్మలేదు. ఆంధ్రలో కొన్ని ఏరియాలు మాత్రం మూడున్నర కోట్లు రేషియోలో విక్రయించారు. అది కూడా నిర్మాత సన్నిహితులైన సుధాకర్ వంటి వారికే. మిగిలిన ఏరియాలను దిల్ రాజు, యువి వంటి వాళ్ల సహకారంతో విడుదల చేసారు.
అలాగే సీడెడ్ లో, ఓవర్ సీస్ లో కూడా ఇలాగే చేసారు. మొత్తం మీద మూడు కోట్లు బడ్జెట్ సినిమాకు విడుదలకు ముందు రెండు కోట్లు తెచ్చుకున్నారు.
ఇప్పుడు ఫస్ట్ వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా అయిదు కోట్లకు పైగా గ్రాస్ చేసుకుంది. నిర్మాతలు వుంచుకున్న ఏరియాలు అన్నీ కలిపి ఫస్ట్ వీకెండ్ రెండు కోట్లకు పైగానే రాబడి కనిపిస్తోంది. ఇంకా ఫస్ట్ వీక్ రన్ వుండనే వుంది.
సినిమా డిస్ట్రిబ్యూషన్ వ్యవహారం అంతా దిల్ రాజు, శిరీష్ ల కంట్రోల్ లోనే సాగుతోంది. టోటల్ గా ఫస్ట్ వీక్ లో నిర్మాత షేర్ మూడు, నాలుగు కోట్లు వచ్చినా ఆనందమే. ఎందుకంటే శాటిలైట్ ఇంకా వుండనే వుంది.