సెక్స్ టాపిక్ తీసుకొచ్చి… మాజీ స్టార్ హీరోయిన్ పాట్లు!

సినిమా వాళ్లేమో ఆమెను దాదాపుగా మరిచిపోయినట్టున్నారు. ఒక దశలో ఆమెను శృంగార దేవతలా చూశారు ప్రేక్షకులు కూడా. క్రేజ్ అనే పదానికి నిర్వచనంలా వెలిగింది ఆమె ప్రభ. మూడో సినిమాకే కోటి రూపాయల పై…

సినిమా వాళ్లేమో ఆమెను దాదాపుగా మరిచిపోయినట్టున్నారు. ఒక దశలో ఆమెను శృంగార దేవతలా చూశారు ప్రేక్షకులు కూడా. క్రేజ్ అనే పదానికి నిర్వచనంలా వెలిగింది ఆమె ప్రభ. మూడో సినిమాకే కోటి రూపాయల పై స్థాయి పారితోషకం.. అక్కడ నుంచి ఆరేడేళ్లు తిరుగు లేకుండా ఇలియానా ప్రభ కొనసాగింది. ఆ దశలో ఆమె వేసిన కొన్ని తప్పటడుగులు.. కెరీర్ ను నాశనం చేశాయి.

ఒకవైపు ఇలియానాకు కాస్త అటుఇటుగా స్టార్ డమ్ ను సంపాదించుకున్న కాజల్, త్రిష వంటి భామలు ఇప్పటికీ చేతి నిండా సినిమాలతో దూసుకుపోతున్నారు. అయితే ఒక దశ దాటాకా కెరీర్ ను మలుచుకోవడంలో ఫెయిలయిన ఇలియానా ఎవరికీ పట్టకుండా పోయింది. ఈ తరుణంలో ఏదో విధంగా తనపై అందరి అటెన్షన్ ను తీసుకురావడానికి ఈ భామ గోవా బీచ్ లలో పడరాని పాట్లు పడుతోంది. ఆఖరికి అర్దనగ్నంగా, సెమీ న్యూడ్ గా దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ వార్తల్లో నిలవడానికి యత్నిస్తోంది.

మరి అదే రూట్లో వెళితే జనాలు బోర్ గా ఫీలవుతారని ఇలియానా.. ఇప్పుడు సెక్స్ జోకులు కూడా పోస్టు చేయడం మొదలుపెట్టినట్టుగా ఉంది. మగాళ్లు ప్రతి ఐదు సెకన్లకూ ఒకసారి సెక్స్ గురించి ఆలోచిస్తారని.. అయితే ఆడవాళ్లకు అంత తీరిక లేదని.. ఆలోచించడానికి ఆడవాళ్లకు చాలా కాన్సెప్టులున్నాయనే చాలా పాత జోక్ ఒకదాన్ని పోస్టు చేసి ఇలియానా వార్తల్లోకి వచ్చింది. సెమీ న్యూడ్ ఫొటోలతో బోర్ కొడుతున్న తరుణంలో.. సోషల్ మీడియాలో సెక్స్ టాపిక్ ను తీసుకొచ్చి, వార్తల్లో నిలవడానికి పాట్లు పడుతున్నట్టుంది పాపం!