'రజనీకాంత్‌కి కెమెరాలు ఎక్కడ వుంటాయో బాగా తెలుసు..' అంటూ సినీ నటుడు కమల్‌హాసన్, తన స్నేహితుడు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. ఈ మధ్య సినిమా సెలబ్రిటీలకు 'గ్లామర్' తగ్గి, పొలిటికల్ సెలబ్రిటీలకు గ్లామర్ పెరిగింది మీడియా కవరేజ్ పరంగా. ఆ విషయం కమల్‌హాసన్‌కీ బాగా తెలుసు. 'కెమెరాలు ఎక్కడుంటాయో తెలుసు..' అనడంలోనే, కమల్‌హాసన్ తన 'తెలివితేటల్ని' ఎంతగా ఉపయోగించాడో అర్థమవుతుంది. ఇది క్లియర్.. రజనీకాంత్ మీద కమల్‌హాసన్ సెటైర్ వేశాడు.
అయితే, రజనీకాంత్ మాత్రమేనా.? కమల్‌హాసన్‌కి కెమెరాలెక్కడుంటాయో తెలియదా.? ఈ ప్రశ్న పుట్టుకురావడం సహజమే. ఎందుకంటే, జల్లికట్టు పేరుతో కమల్‌హాసన్ చేసిన పబ్లిసిటీ స్టంట్లు అన్నీ ఇన్నీ కావు. 'తమిళ సినీ ప్రముఖులు పబ్లిసిటీ కోసం పాకులాడొద్దు.. జల్లికట్టు క్రెడిట్ మీ ఖాతాలో వేసుకోవద్దు..' అని సెటైర్లు వేస్తూనే, ఆ క్రెడిట్‌ని తన ఖాతాలో వేసుకోవడానికి పాకులాడిన ఘనుడు కమల్‌హాసన్.
రజనీకాంత్‌కి కమల్‌హాసన్ అత్యంత సన్నిహితుడు. 'ఇద్దరం కలిసి ఓ సినిమాలో నటిద్దాం..' అని మొన్నీమధ్యనే రజనీకాంత్, కమల్‌హాసన్ అనుకున్నారు. అయితే, ఇప్పుడు రజనీకాంత్ చుట్టూ పొలిటికల్ వేవ్ కన్పిస్తోంది. ఆ వేవ్, సహజంగానే కమల్‌హాసన్‌కి 'ఇంపుగా' అన్పించి వుండదు. అదీ, అక్కడ వచ్చింది తేడా.! ఒకరు మహా నటుడైతే, ఇంకొకరు సూపర్ స్టార్. ఈ ఇద్దరి మధ్యా 'పొలిటికల్ సెటైర్లు' షురూ అవడం, అభిమానులకే పెద్ద షాకిచ్చింది.