ప్రస్తుతం బాలీవుడ్ మీడియా అంతా ఈ యాంగిల్ చుట్టూ తిరుగుతోంది. ఓ వైపు రణబీర్, సిద్దార్థ్ మల్హోత్రా.. మరోవైపు అలియాభట్, జాక్వెలిన్, కత్రిన లాంటి హాట్ స్టార్స్ ఎఫైర్లు ఉంటుండగా మీడియా అంతా ఇలియానా చుట్టూ తిరగడానికి బలమైన కారణాలే కనిపిస్తున్నాయి.
ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో ఇలియాన కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీళ్లిద్దరి మధ్య వ్యవహారం ఎలా ఉందంటే.. దాదాపు భార్యభర్తలు అన్నట్టుగానే ఇద్దరూ కలిసిపోయారు. పెళ్లికి తక్కువ, సహజీవనానికి ఎక్కువ అన్నట్టు ఉంది వీళ్ల మధ్య అన్యోన్యం.
దీనికి తోడు ఆమధ్య ఆండ్రూ సొంత దేశం ఆస్ట్రేలియా వెళ్లొచ్చింది ఇలియానా. అక్కడికి వెళ్లి వచ్చిన తర్వాత ఇలియానా మాటల్లో చాలా తేడా కనిపించింది. ఆండ్రూ ఇప్పుడు మా ఇంట్లో మనిషంటూ ఆమె స్టేట్ మెంట్స్ ఇవ్వడం అనుమానాలు రేకెత్తిస్తోంది. దీంతో ఆస్ట్రేలియాలో ఇలియానా, ఆండ్రూకు పెళ్లయిపోయిందంటూ గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి.
తన స్నేహితులు, బంధువులు సమక్షంలో ఆస్ట్రేలియాలో ఇలియానాను ఆండ్రూ వివాహం చేసుకున్నాడట. అయితే ఈ విషయంపై ఇలియానా మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. గాసిప్స్ ను గాలికొదిలేసి ఆండ్రూతో హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.