హిందీ సినిమాలపై మోజుతో దక్షిణాదిని పట్టించుకోవడం మానేసింది ఇలియానా. ఆమె చేసిన చివరి చిత్రం 'జులాయి'. ఇప్పుడు మళ్లీ ఆ సినిమా కోసమే దక్షిణాదికి రిటర్న్ అవుతోంది ఇలియానా. అదెలా అంటారా..?? జులాయి చిత్రాన్ని తమిళంలో త్యాగరాజన్ రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి 'సాహసం' అనే టైటిల్ ఖరారు చేశారు.
ప్రశాంత్ కథానాయకుడు. కథానాయికగా ఇలియానాని ఎంచుకొన్నారు. ఇలియానా కూడా ఈ సినిమాలో నటించడానికి ఒప్పకొందట. ఇంకేం చేస్తుంది మరి. ఉత్తరాదిన అంత బిజీ ఏం కాదు. అక్కడ అడపాదడపానే అవకాశాలొస్తున్నాయి. అందుకే ఈసారి ఎలాంటి బెట్టూ చేయకుండా ఓకే చెప్పేసింది. ఫిబ్రవరిలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్తుంది.