అందాల భామ ఇలియానా పెళ్ళి గురించి తాజాగా బాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఇలియానా, తన స్నేహితుడు ఆండ్రూతో చాలాకాలంగా సహజీవనం చేస్తోంది. సన్నిహితుల్ని పిలిచి, ఓ పెళ్ళి లాంటి తంతుని చాన్నాళ్ళ క్రితమే ఇలియానా పూర్తి చేసిందట కూడా. అయితే, ఇలియానా ఎందుకోగానీ ఈ పెళ్లి, సహజీవనం వంటి విషయాల్ని కామప్ చేసేసింది. బాయ్‌ఫ్రెండ్‌తో మాత్రం బాలీవుడ్ పార్టీల్లో ఇలియానా తెగ హల్‌చల్ చేసింది ఆ మధ్య.
ఇటీవలే ఇలియానా బాలీవుడ్‌లో 'రుస్తుం' అనే సినిమా చేసిన విషయం విదితమే. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇలియానాని 'లవ్ గురించి మీ అభిప్రాయమేంటి.?' అని ప్రశ్నిస్తే, 'నేనూ ప్రేమ బాధితురాలినే..' అంటూ నవ్వేసిందామె. ఆ నవ్వు వెనుక విషాదం వుందంటూ బాలీవుడ్ సినీ జనం తాజాగా గుసగుసలాడుకుంటున్నారు.
అసలు విషయమేంటంటే, ఇలియానా గత కొంతకాలంగా తన బాయ్‌ఫ్రెండ్‌కి దూరంగా వుంటోందట. ఈ విషయం ఇప్పుడెలా బయటకు వచ్చిందోగానీ, ఇలియానా – ఆండ్రూ పెళ్ళి వార్తల్ని కూడా ధృవీకరిస్తూ కొన్ని ఫొటోలు మీడియాకి లీక్ అయ్యాయి. అవి నిజంగానే పెళ్ళి ఫొటోలా.? మార్ఫింగ్ ఫొటోలా.? అన్నదానిపైనా రకరకాల ఊహాగానాలు విన్పిస్తున్నాయి.
తెలుగు, తమిళ సినిమాల్లో కొంతకాలం హల్‌చల్ చేసిన ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్‌కే పరిమితమైపోయింది. అక్కడ ఇలాంటివన్నీ మామూలే. అందుకే, ఇలియానా లవ్ ఎఫైర్ కూడా అక్కడి స్టయిల్‌కి తగ్గట్టే, ప్రారంభమై, అటకెక్కేసినట్లుంది.