చాలాకాలం తర్వాత ఇలియానా తెలుగు మీడియా ముందుకొచ్చింది. 'పెళ్ళి' గురించి ఇలియానాకి మీడియా నుంచి ప్రశ్నలు పోటెత్తాయి. ప్రియుడు ఆండ్రూతో ఆల్రెడీ ఇలియానా 'వైవాహిక బంధాన్ని' కొనసాగిస్తోంది. అయితే, పెళ్ళయ్యిందా.? లేదా.? అన్నదానిపై ఇలియానా ఇంకా సస్పెన్స్ మాత్రం కొనసాగిస్తూనే వుంది. ఇప్పటికీ ఇలియానా 'నా భర్త ఆండ్రూ' అని చెప్పడంలేదు.
'మా పెళ్ళయ్యింది' అని ఒప్పుకోవడంలేదు. ఆండ్రూని ఇంకా ప్రియుడిగానే ఆమె చెప్పుకుంటూ వస్తోంది. 'మా బంధం' అంటూ ఆండ్రూతో తనకున్న 'రిలేషన్' గురించి చెప్పిన ఇలియానా, దాన్ని వైవాహిక బంధంగా కన్‌ఫామ్ చేయలేదు.
'నాకు ప్రెగ్నెన్సీ అంటూ ప్రచారం చేశారు' అని చెప్పిందే తప్ప, 'అదంతా ఉత్తదే' అని కొట్టి పారేయలేదు. ఇలియానా ప్రెగ్నెంట్.. అంటూ గాసిప్స్ రావడం, ఇంతలోనే ఆమె 'అమర్ అక్బర్ ఆంటోనీ' ప్రమోషన్స్ కోసం హైద్రాబాద్‌లో ల్యాండ్ అవడం తెల్సిన విషయాలే.
ఇక్కడ, హైద్రాబాద్ వేదికగా 'పెళ్ళి, ప్రెగ్నెన్సీ'పై ఇలియానా స్పష్టతనిస్తుందని అంతా అనుకున్నా.. అలా అనుకున్న వారందర్నీ నిరాశపర్చింది ఇలియానా. నిజానికి, ఇలియానా చాలా తెలివైంది. ఆండ్రూతో ఇలియానా 'స్నేహం' ఈనాటిది కాదు. చాలాకాలం నుంచే కొనసాగుతోంది.
మధ్యలో ఇద్దరి మధ్యా చిన్న చిన్న స్పర్ధలు వచ్చాయి. దాంతో విడిపోయారు కూడా. మళ్ళీ ఒక్కటయ్యారు. ఆ స్నేహం.. సహజీవనం అంతా ఓపెన్ సీక్రెట్. 'మై లవ్..' అనీ, 'మై హబ్బీ..' అనీ ఆండ్రూ గురించి, అతనితో రిలేషన్ గురించీ సోషల్ మీడియాలో కన్‌ఫామ్ చేసిన ఇలియానా, ఆ విషయాన్ని మీడియా ముఖంగా చెప్పడానికి మాత్రం తెగ మొహమాట పడిపోతోంది.
ఇంతకీ, ఇలియానా – ఆండ్రూల పెళ్ళయ్యిందా.? లేదా.? ఏమో, ఆ ఇద్దరికే తెలియాలి.
టీడీపీలోకి పంపి.. ఎమ్మెల్సీ సీట్లను కొనిచ్చిన చరిత్ర ఆయనది.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్