cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

కూతురి పక్కనే సెక్స్ లైఫ్ పై హీరో కామెంట్స్!

కూతురి పక్కనే సెక్స్ లైఫ్ పై హీరో కామెంట్స్!

బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జొహార్ హోస్టుగా వ్యవహరించే కాఫీ విత్ కరణ్ టాక్ షో చాలా బోల్డ్ గా ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ టాప్ సెలబ్రిటీలను కూర్చోబెట్టుకుని మాట్లాడే కరణ్.. వారితో చాలా బోల్డ్ గా మాట్లాడుతూ ఉంటాడు. బోల్డ్ అంటే.. ప్రధానంగా సెక్స్ గురించి మాట్లాడేస్తూ ఉంటాడు.

సెక్స్ లేకుండా ఎన్ని రోజులు ఉండగలరు? తొలి సెక్స్ అనుభవం ఎప్పుడు? ఎంతమందితో అక్రమ సంబంధాలు.. గే, లెస్బియన్ సెక్స్ అనుభవాలున్నాయా? వంటి ప్రశ్నలు కరణ్ షోలో కామన్. వరసకు అన్నదమ్ములు, అక్కచెల్లెల్లు, అన్నా చెల్లెళ్లు అయ్యే సెలబ్రిటీలను, బాలీవుడ్ వాలాలను కూర్చోబెట్టుకుని కరణ్ ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు.

వాళ్లు కూడా వెకిలిగా, బోల్డ్ గా, పచ్చిగా సమాధానాలు ఇస్తూ ఉంటారు. ఈ పరంపరలో తాజాగా ఏకంగా తండ్రీకూతుళ్లను కూర్చోబెట్టి కరణ్ సెక్స్ ప్రస్తావన తెచ్చాడు. ఈ సారి వంతు సైఫ్ అలీఖాన్, సారా అలీఖాన్ లది. ఎదిగిన కూతురును పక్కనే పెట్టుకుని తన తాజా భార్యతో సెక్స్ అనుభవం గురించి మాట్లాడాడు సైఫ్.

సైఫ్ మొదటి భార్య అమృతాసింగ్ కూతురు సారా అని, సైఫ్ రెండో భార్య కరీనా కపూర్ అని చెప్పనక్కర్లేదు. రెండో భార్యతో సైఫ్ కుకొడుకు పుట్టాడు. టాక్ షోలో కరీనా గురించి సైఫ్ ఏవో సెక్సీ కామెంట్లు చేస్తే.. తమ సెక్సువల్ లైఫ్ గురించి చెబుతుంటే.. సారా అలీఖాన్ చెవులు మూసుకుంది. అది వాళ్లకు సరాదాగానే అనిపించిందేమో!