Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఇల్లు అమ్ముతున్న సీనియర్ హీరో ?

ఇల్లు అమ్ముతున్న సీనియర్ హీరో ?

ఆయనో సీనియర్ హీరో. ఆస్తులకు కొదవేం లేదు. ఇళ్లు, వాకిళ్లు ఒకటి రెండు లెక్కన చాలానే వున్నాయి. వీటికి తోడు సిటీలో మరో మాంచి ఇల్లు కట్టే ఆలోనచలో వున్నారు. 

కానీ ఇలాంటి నేపథ్యంలో ఫిల్మ్ నగర్ ప్రాంతంలో వున్న తన పాత ఇంటిని అమ్మే ఆలోచన చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇప్పటికే ఈ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అయితే ప్రయిమ్ లొకేషన్ లో వుండడంతోనూ, పెద్ద భవంతి కావడంతోనూ కాస్త భారీగానే రేటు వుంటుందని తెలుస్తోంది. అందుకే అంత సులువుగా బేరాలు రావడం లేదని ఇండస్ట్రీ టాక్.

గమ్మత్తేమిటంటే ఈ ప్రాపర్టీ అమ్ముతారని కొన్నేళ్ల క్రిందట కూడా టాక్ వినిపించింది. అప్పట్లో ఆ వార్తలను ఖండించారు. ఆ వార్తలు కూడా నిజం కాలేదు. కానీ మళ్లీ ఇప్పుడు అవే వార్తలు వినిపిస్తున్నాయి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?