ఇంద్రగంటి అతి చిన్న సినిమా?

చిన్న సినిమాలందు అతి చిన్న సినిమాలు వేరయా…అన్నది టాలీవుడ్ సూక్తి. ఇంద్రగంటి ఓ డిఫరెంట్ డైరక్టర్. ఆయన నలభై కోట్ల సినిమా తీయగలరు నాలుగు కోట్ల సినిమా తీయగలరు. అమీతుమీ లాంటి అతి చిన్న…

చిన్న సినిమాలందు అతి చిన్న సినిమాలు వేరయా…అన్నది టాలీవుడ్ సూక్తి. ఇంద్రగంటి ఓ డిఫరెంట్ డైరక్టర్. ఆయన నలభై కోట్ల సినిమా తీయగలరు నాలుగు కోట్ల సినిమా తీయగలరు. అమీతుమీ లాంటి అతి చిన్న సినిమా, సమ్మోహనం లాంటి చిన్న సినిమా, వి లాంటి పెద్ద సినిమా అన్నీ ఆయన అందించినవే.

వి సినిమా తరువాత వాస్తవానికి ఆయన ఓ మంచి సినిమా ప్లాన్ చేసుకున్నారు. నాగ్ చైతన్య హీరో. సాహు గారపాటి నిర్మాత. దాని తరువాత మిడ్ రేంజ్ సినిమా వుంది. అది వేరే సంగతి. కానీ చైతన్య ఇప్పట్లో రెడీగా లేడు. లవ్ స్టోరీ పూర్తి కావాలి. ఆ తరువాత విక్రమ్ కే కుమార్ సినిమా పూర్తి చేయాలి. అంటే కనీసం ఎలా లేదన్నా ఓ ఎనిమిది నెలలు టైమ్ పడుతుంది.

పైగా ఇంద్రగంటి-చైతన్య సినిమా నిన్ను కోరి సినిమా మాదిరిగా ఫారిన్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఫ్యామిలీ డ్రామా అని బోగట్టా. అందుకే కోవిడ్ పరిస్థితులు పూర్తిగా చక్కబడితే తప్ప, వ్యవహారం ముందుకు సాగదు. అందుకే ఈ లోగా ఓ చిన్న సినిమా లాగించేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. 

అయితే దీనికి మెయిన్ స్టార్ కాస్ట్ ఎవరు అన్నది తెలియదు కానీ, సపోర్టింగ్ స్టార్ కాస్ట్ ను, టీమ్ ను మెల మెల్లగా ఇంద్రగంటి సెట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కానీ ఏ విషయం ఇప్పుడే అఫీషియల్ గా బయటకు రాదు. వి సినిమా విడుదల తరువాత ఏదయినా వుండొచ్చు.ఈ అతి చిన్న సినిమా ప్లానింగ్ చిన్న లేదా మీడియం సినిమా గా మారిపోయినా ఆశ్చర్యం లేదు. 

ఎవరినీ వదిలి పెట్టను