కొండను అద్దంలో దాచాలనుకోవడం, ఈ డిజిటల్ యుగంలో వార్తలను దాచాలనుకోవడం ఒకటే. దిల్ రాజు నిర్మించే ఇంద్రగంటి సినిమాలో సుధీర్ బాబుతో పాటు నాచురల్ స్టార్ హీరో నాని కూడా వున్నారని ఎప్పటి నుంచో వార్తలు కోడై కూస్తున్నాయి. పైగా ఫస్ట్ హాఫ్ చివర్లో వస్తారని, సెకండాఫ్ అంతా వుంటారని, పెళ్లి అయిపోయిన వ్యక్తి క్యారెక్టర్ అని, డ్యూయట్లు వుండవని, విలన్ షేడ్ వుంటుందని ఇలా రకరకాల వార్తలు ఎప్పుడో బయటకు వచ్చేసాయి.
ఇలాంటి నేపథ్యంలో ఆ సినిమాను ప్రారంభిస్తూ, టైటిల్ అనౌన్స్ చేస్తూ నాని పేరు మాత్రం డిజైన్ లో లేకుండా చేసారు? అంటే నాని ఈ సినిమాలో వున్నాడన్న దానిపై సస్పెన్స్ మెయింటెయిన్ చేయాలనా? లేక నానికి బదులుగా వేరే వాళ్లని తీసుకోవాలనే కొత్త ఆలోచన ఏమైనా చేస్తున్నారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
వాస్తవానికి ఈ ప్రాజెక్టు ముందుగా శర్వానంద్ దగ్గరకు వెళ్లింది. కానీ ఎందుకో ఈ థ్రిల్లర్ పట్ల శర్వా అంత ఆసక్తి కనబర్చలేదు. దాంతో మళ్లీ వెనక్కు వచ్చి, సుధీర్ బాబుతోనే చేస్తున్నారు.