మహేష్.. ఔరా.. నిజమేనా?

టాలీవుడ్ ఇన్నర్ సర్కిళ్లలో విశ్వసనీయంగా వినిపిస్తున్న విషయం ఇది. అనిల్ సుంకర-దిల్ రాజు కలిసి అనిల్ రావిపూడి కాంబినేషన్ లో నిర్మించే సినిమాకు హీరో మహేష్ బాబుకు ఇస్తున్న రెమ్యూనిరేషన్ తెలిస్తే జనాల కళ్లు…

టాలీవుడ్ ఇన్నర్ సర్కిళ్లలో విశ్వసనీయంగా వినిపిస్తున్న విషయం ఇది. అనిల్ సుంకర-దిల్ రాజు కలిసి అనిల్ రావిపూడి కాంబినేషన్ లో నిర్మించే సినిమాకు హీరో మహేష్ బాబుకు ఇస్తున్న రెమ్యూనిరేషన్ తెలిస్తే జనాల కళ్లు తిరగాల్సిందే. ఇప్పటివరకు టాలీవుడ్ లో ఇంత రెమ్యూనిరేషన్ ఎవ్వరికీ ఇచ్చివుండరు. బాహుబలి ప్రభాస్ సంగతి బయటకు రాలేదు కాబట్టి తెలియదు.

అనిల్ రావిపూడి-మహేష్ బాబు సినిమాలో ఆ ఇద్దరి రెమ్యూనిరేషన్లే 61 కోట్లు. అనిల్ రావిపూడికి తొమ్మిదికోట్లు. మహేష్ బాబుకు 52 కోట్లు. ఇదీ విశ్వసనీయ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సంగతి. అనిల్ రావిపూడి చకచకా సినిమా తీస్తారు. వీలయినంత తక్కువలో  తీస్తారు. అందువల్ల ఈ ప్రాజెక్టుకు మంచి లాభాలు వుండే అవకాశం వుంది.

మహర్షి మాదిరిగా 150 సినిమాకు 150 ఖర్చు అన్నట్లు వుండదు. అందుకే మహేష్ బాబుకు అంత రెమ్యూనిరేషన్ ఇస్తున్నట్లు బోగట్టా.

పార్టనర్ షిప్ నా?
ఇదిలావుంటే ఈ యాభై రెండుకోట్ల రెమ్యూనిరేషన్ వెనుక అనిల్ సుంకరకు హీరో మహేష్ బాబు మధ్య పార్టనర్ షిప్ ఒప్పందం కుదరిందని అయితే అందులో 52 కోట్లు లేదా కొంతశాతం వాటా అనే క్లాజ్ వుందని వినిపిస్తోంది. ఈ ఒప్పందం వివరాలు నమ్రత, మహేష్ బాబు, దిల్ రాజు, అనిల్ సుంకరలకు మాత్రమే తెలుసు అని కూడా వినిపిస్తోంది. ఏమైనా మహేష్ కు యాభైకోట్లకు పైనే రెమ్యూనిరేషన్ ఈ సినిమా వల్ల పక్కా అని వినిపిస్తోంది. 

శింగనమలలో వైఎస్సార్సీపీ విజయకేతనం గ్యారెంటీనా!