ఇరవై నుంచి ఇరవై అయిదు ఏళ్ల కుర్రాళ్లు హీరోలుగా చితక్కొట్టేస్తున్నారు..ముఫైకి చేరుతున్న హీరోలు..వెరైటీ సబ్జెక్ట్ ల కోసం కిందా మీదా అవుతున్నారు. ఇలాంటప్పుడు ఫార్టీ ప్లస్సులూ, తాతయిపోయిన హీరోలూ ఏం చేయాలి…తమ వయసుకు తగిన పాత్రలను ఎంచుకోవాలి. అంతే కానీ, తగుదునమ్మా అంటూ ఇంకా హీరోలుగానే వేస్తామంటే, ఎవరు చూస్తారు? వేసామా.. రిలీజ్ చేసామా.. అన్నదే తప్ప, జనం చూసారా లేదా అన్నది వుండదు.
శ్రీకాంత్ ఒకప్పుడు మాంచి ఫ్యామిలీ హీరో. అలాంటి హీరో సినిమాలు ఇప్పుడు ఎవరికీ పట్టడం లేదు. ఈ వారం వీడికి దూకుడెక్కువ అంటూ సినిమా వచ్చింది. పాపం, ఆ సినిమా విడుదలయిందా.. అలాంటి సినిమా ఒకటి వుందా అన్నంత అనుమానం. అయినా శ్రీకాంత్ ఇలా ఎన్నాళ్లు హీరోగా గజనీ దండయాత్రలు సాగిస్తాడో.. హాయిగా జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్ మాదిరిగా తండ్రి పాత్రలు వేసుకోవడం మానేసి. కానీ మన తెలుగు హీరోలు …. ఆ ఒక్కటీ తప్ప .. ఏ సలహా అయినా వింటారు..