దిల్ రాజు బ్యానర్ నుంచి సభకు నమస్కారం అనే సినిమా వస్తుందని, అల్లుఅర్జున్ హీరో అని వార్త గుప్పుమంది. దానికి నిర్మాత దిల్ రాజు వివరణ కూడా ఇచ్చేసారు. అలాంటిది ఏమీలేదని, ఏ కొత్త ప్రాజెక్టు ప్లాన్ చేసినా మీడియాకు తప్పకుండా చెబుతామని అన్నారు. అసలు ఇంతకీ ఈ 'సభకు నమస్కారం' సంగతేమిటి?
వాస్తవానికి ఓ కొత్త దర్శకుడు సభకు నమస్కారం అనే టైటిల్ లో పొలిటికల్ లైన్ తో దిల్ రాజుకు కథ చెప్పారు. దిల్ రాజకు ఓ చిన్న సెంటిమెంట్ వుంది. మాస్ సినిమాలు కథలు మంచివి వస్తే బన్నీకి, ఫ్యామిలీ సినిమాల కథలు వస్తే ఎన్టీఆర్ కు ఓసారి నెరేషన్ ఇప్పిస్తారు. వాళ్ల అయిడియా, సలహా తీసుకుంటారు. అలాగే ఈ స్టోరీని కూడా బన్నీకి నెరేషన్ ఇచ్చేసారు.
అయితే ఈ సినిమాను నానితో చేయాలన్న ఆలోచన అయితే దిల్ రాజుకు వున్నట్లు బోగట్టా. కానీ కొత్త దర్శకుడికే అవకాశం ఇవ్వడమా? అతని కథ తీసుకుని, హరీష్ శంకర్ ను నానిని కలిపి చేయడమా? అన్న సందిగ్దంలో వున్నట్లు తెలుస్తోంది. అది ఫైనల్ అయితే తప్ప, సభకు నమస్కారం హీరో ఎవరు? డైరక్టర్ ఎవరు? అన్నదానిపై క్లారిటీరాదు.