ఇప్పటికి అందుకుంది సాహో

బాహుబలి ప్రభాస్ నటించిన అత్యంత భారీ సినిమా సాహో విషయంలో ఇప్పటి వరకు చిన్న అసంతృప్తి వుంది. పబ్లిసిటీ సరిగ్గా చేయడం లేదని, సినిమాకు వస్తున్న బజ్ చాలదని. నిర్మాతలు పలు భాషల్లో ఈ…

బాహుబలి ప్రభాస్ నటించిన అత్యంత భారీ సినిమా సాహో విషయంలో ఇప్పటి వరకు చిన్న అసంతృప్తి వుంది. పబ్లిసిటీ సరిగ్గా చేయడం లేదని, సినిమాకు వస్తున్న బజ్ చాలదని. నిర్మాతలు పలు భాషల్లో ఈ సినిమాను నిర్మిస్తున్నందున, అలాగే ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ చేయాల్సిన పనులతో, పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పబ్లిసిటీ విషయంలో దృష్టి పెట్టలేదు.

అయితే దాదాపు గతవారం రోజులగా అసలు పని ప్రారంభించారు. వరుసగా స్టిల్స్ వదలడం, ట్రయిలర్ రిలీజ్ ను భారీగా ప్లాన్ చేయడం అన్నది కలిసి వచ్చింది. కేవలం ఆన్ లైన్ లో వదిలేయకుండా సెంటర్ల వారీ ఒక్కో థియేటర్ లో ట్రయిలర్ ను లాంచ్ చేస్తున్నారు. దీంతో సినిమా మీద ఆసక్తి పెరిగింది.

ఆన్ లైన్ లో వదిలేస్తే స్మార్ట్ ఫోన్ ల్లో చిన్న స్క్రీన్ ల మీద చూస్తారు. కానీ సాహో లాంటి భారీ సినిమాను పెద్ద స్క్రీన్ మీద, మంచి సౌండ్ ఎఫెక్ట్ తో చూస్తే, ఆ కిక్ నే వేరు. అందుకే ఆ విధంగా అన్ని సెంటర్లలో ఒక్కో థియేటర్ ఎంచుకుని ప్లాన్ చేసారు. ఇది వర్కవుట్ అయ్యేలాగే వుంది.

మొత్తంమీద సాహో ఫీవర్ మెల్లగా అలుముకుంటోంది. ట్రయిలర్ ను బట్టి ఈ బజ్ పెరగడం ఏ రేంజ్ కు అన్నది ఆధారపడి వుంటుంది.