బాకీ వసూలుకు అర్థనగ్న ప్రదర్శన

ఈ ముచ్చట టాలీవుడ్ కు సంబంధించిందే కానీ, హైదరాబాద్ వ్యవహరం కాదు. ఆంధ్రలోని ఓ ఏరియా వ్యవహారం. ఓ ఎగ్జిబిటర్ ఓ డిస్ట్రిబ్యూటర్ కు మూడో, అయిదో లక్షలు బాకీ పడ్డారట. ఇది టాలీవుడ్…

ఈ ముచ్చట టాలీవుడ్ కు సంబంధించిందే కానీ, హైదరాబాద్ వ్యవహరం కాదు. ఆంధ్రలోని ఓ ఏరియా వ్యవహారం. ఓ ఎగ్జిబిటర్ ఓ డిస్ట్రిబ్యూటర్ కు మూడో, అయిదో లక్షలు బాకీ పడ్డారట. ఇది టాలీవుడ్ లో కామన్. లక్షలు ఏం ఖర్మ కోట్లలోనే డబ్బులు అటు ఇటు అడ్జస్ట్ అవుతుంటాయి. ఆ సినిమా డబ్బులు, ఈ సినిమాకు, ఈ సినిమా డబ్బులు ఆ సినిమాకు మారుతుంటాయి.

అయితే ఎగ్జిబిటర్ ను డబ్బులు అడిగి, ఇవ్వడం లేదని, ఆ డిస్ట్రిబ్యూటర్ మేనేజర్ తిన్నగా వెళ్లి ఓ చిత్రమైన పని చేసాడని డిస్ట్రిబ్యూటర్ సర్కిళ్లలో వినిపిస్తోంది. ఆ డిస్ట్రిబ్యూటర్ మేనేజర్ తిన్నగా ఎగ్జిబిటర్ ఆపీసుకు వెళ్లి, ఫ్యాట్, షర్ట్ విప్పి, అక్కడి సోఫాలో పడుకుని నిరసన ప్రదర్శన చేసాడట.  ఇదంతా అక్కడి సిసి కెమేరాల్లో కూడా రికార్డ్ అయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే మొత్తానికి డబ్బులు ఇచ్చేసిన ఆ ఎగ్జిబిటర్ ఇకపై తన థియేటర్లలో ఆ డిస్టిబ్యూటర్ పంపిణీ చేసే సినిమాను ప్రదర్శించకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కానీ ఇలాంటి నిర్ణయాల అమలు కష్టం. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ల దయలేకుండా థియేటర్లకు సినిమాలు రావు. పెద్ద సినిమాలు రాకపోతే, పార్కింగ్, క్యాంటీన్ వసూళ్లు బాగుండవు. అందువల్ల మళ్లీ ఏదో పాయింట్ దగ్గర రాజీ తప్పదు.

కానీ అర్థనగ్న ప్రదర్శనతో డబ్బులు వసూలు చేయడం అన్నదే డిస్ట్రిబ్యూటర్ స్కర్కిళ్లలో కొత్త ట్రెండ్ గా వినిపిస్తోంది.