ఒకప్పుడు కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించిన సెక్సీ హీరోయిన్ రంభ పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది. ఇప్పటికీ ఆమె సినిమాలు టీవీల్లో వస్తుంటే లొట్టలెయ్యని రసికులు ఉండరంటే అతశయోక్తి కాదు.
అలాంటి రంభపై హైద్రాబాద్‌లో పోలీసు కేసులు ఉన్నాయనీ, తన తమ్ముడు పెళ్లి చేసుకున్న అమ్మాయిని కట్నం కోసం వేధించారనీ, రంభపై ఆరెస్ట్‌వారెంట్ ఉందనీ, ఆమె విదేశాలనుంచి ఇండియాకి ఎప్పుడు వచ్చినా రాగానే అరెస్ట్ చేస్తారనీ వార్తలు వచ్చాయి. అయితే రంభ మాత్రం తన మీద కేసులు గట్రా ఏమీ లేవనీ, నేను ఎక్కడైనా, ఏ ప్రాంతంలోనైనా నిర్భయంగా తిరగగలననీ ఘంటాపధంగా చెబుతుంది.
అంటే ఆవిడ మీద ఉన్న కేసులు మాఫీ అయిపోయాయా లేక కేసులు పెట్టిన కక్షిదారులు కాంప్రమైజ్ అయ్యి కేసులు వాపస్ తీసుకున్నారో ఏమో కానీ, రంభ ధైర్యం చూస్తుంటే కేసులకే కాదు. మళ్లీ నటించడానికి కూడా భయపడడం లేదని అర్ధం అవుతుంది కదా.