ఇప్పుడు ఇండస్ట్రీ కదులుతుందా?

హీరోల, టాప్ డైరక్టర్ల మీద వన్ పర్సంట్ నెగిటివ్ న్యూస్ వస్తే ఆగం ఆగం అయిపోతారు. మీడియాను తొక్కేయాల్సిందే. ప్రకటనలు ఆపాల్సిందే.అంటూ సమావేశాల మీద సమావేశాలు పెట్టేస్తారు. కిందా మీదా అయిపోతారు. ట్విట్టర్ ను…

హీరోల, టాప్ డైరక్టర్ల మీద వన్ పర్సంట్ నెగిటివ్ న్యూస్ వస్తే ఆగం ఆగం అయిపోతారు. మీడియాను తొక్కేయాల్సిందే. ప్రకటనలు ఆపాల్సిందే.అంటూ సమావేశాల మీద సమావేశాలు పెట్టేస్తారు. కిందా మీదా అయిపోతారు. ట్విట్టర్ ను నింపేస్తారు. మరి ఇప్పుడు వీళ్లంతా ఏమంటారో? ఆర్జీవీ అనే డైరక్టర్ నేరుగా పవన్ కళ్యాణ్-మెగాస్టార్, నాగబాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్, రష్యన్ మహిళ(పవన్ భార్య), నలుగులు పిల్లలు, నాలుగు గేదెలు (పవర్ ఫార్మ్ హవుస్)ను క్యారెక్టర్లుగా పెట్టి సినిమా తీస్తాను అంటున్నారు.

ఎవరి పేరు పెట్టకుండా, ఎవరి ఫొటో పెట్టకుండా, గ్యాసిప్ రాస్తేనే, ఎవరికి వారు భుజాలు తడుకుముకుని, నానా యాగీ చేస్తారు. ఫొన్ ల మీద ఫోన్ లు చేసి, ఆ గ్యాసిప్ తీసేయమంటూ కిందా మీదా అయిపోతారు. అలాంటిది అచ్చంగా పవన్ కళ్యాణ్ ను పోలిన మనిషిని తయారుచేసి, పిఎస్, ఎమ్ఎస్, ఎన్ బి, టిఎస్, రష్యన్ మహిళ, నలుగురు పిల్లలు, నాలుగు గేదెలు అంటూ సినిమా తీస్తా అని ఆర్జీవీ ప్రకటించారు. మరి ఇప్పుడు ఇండస్ట్రీ ఏమంటుందో?

ఒక వేళ ఏ వెబ్ సైట్ అన్నా ఇవే పాత్రలతో, ఇలాగే ఓ సీరియల్ ప్రచురించడం ప్రారంభిస్తే, ఇదే జనాలు ఏమంటారో? బ్యాన్ చేయాలి. తొక్కేయాలి. అంటూ వీరంగం ఆడతారు. మరి ఆర్జీవీ విషయంలో మాత్రం రాయి వేయడానికే జంకుతారు. గతంలో పవన్ మీద శ్రీరెడ్డి మాటల దాడి చేసినపుడు కూడా ఆయనకు ఆయనే రంగంలోకి దిగాల్సి వచ్చింది తప్ప, ఇండస్ట్రీ వెనుక రాలేదు. అందుకే మెగా హీరోలు అందరికీ ఈ ఇండస్ట్రీ ఒకే తాటిపైకి రావడం లాంటి నీతి సూత్రాలు చూస్తే ఒళ్లు మండుతుంది.