ఇప్పుడు ఎన్టీఆర్ మాట్లాడతారా?

తాత ఎన్టీఆర్ బయోపిక్ వచ్చింది. రెండుభాగాలు విడుదలయ్యాయి. కానీ మనవుడు ఎన్టీఆర్ మాత్రం మాట్లాడలేదు. ఆయన తన ట్విట్టర్ హ్యాండిల్ లో కూడా ఎప్పుడో కథానాయకుడు ట్రయిలర్ ను షేర్ చేయడం మినహా మరేదీ…

తాత ఎన్టీఆర్ బయోపిక్ వచ్చింది. రెండుభాగాలు విడుదలయ్యాయి. కానీ మనవుడు ఎన్టీఆర్ మాత్రం మాట్లాడలేదు. ఆయన తన ట్విట్టర్ హ్యాండిల్ లో కూడా ఎప్పుడో కథానాయకుడు ట్రయిలర్ ను షేర్ చేయడం మినహా మరేదీ చేయలేదు. కథనాయకుడు విడుదల తరువాత అస్సలు దాని గురించి మాట్లాడలేదు. ఆ సినిమా చూసారో? లేదో కూడా తెలియదు. మహానాయకుడు ట్రయిలర్ వచ్చిన ఆయన తన ట్విట్టర్ హ్యాండిల్ లో వేయలేదు.

ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలకు ప్రత్యేకంగా షోలు వేసారు. నందమూరి కుటుంబం అంతా దాదాపు వచ్చింది కానీ ఎన్టీఆర్ మాత్రంరాలేదు. ఇలాంటి నేపథ్యంలో ఎన్టీఆర్ బయోపిక్ సూత్రధారి, నిర్మాత బాలకృష్ణ బాబాయ్ తో ఎన్టీఆర్ వేదిక పంచుకోబోతున్నారు. తన సోదరుడు కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 118 ప్రీరిలీజ్ ఫంక్షన్ కు ఇటు ఎన్టీఆర్ అటు బాలయ్య ఇద్దరూ ముఖ్య అతిధులుగా హాజరవుతారని తెలుస్తోంది.

మరి ఇప్పుడు అయినా వేదిక మీద ఎన్టీఆర్ తాతగారు.. అంటే ఓ సారి స్మరించే సమయంలో బయోపిక్ గురించి మాట్లాడక తప్పదేమో? లేదా తెలివిగా మాట్లాడి తప్పించుకుంటారో? చూడాలి. 

పేరుకి ఎన్టీఆర్‌ బయోపిక్‌ కానీ… రెండు భాగాలు

ప్రజారాజ్యం కన్నా పేలవంగా ముగింపు?