If there's going to be anything better than #NTRKathanayakudu, it's
going to be #NTRMahanayakudu. Looking forward already. Congratulations
to the entire team.
***
#NTRKathanayakudu is undoubtedly the best tribute one could have ever
given to the LEGEND of Telugu cinema, NT Rama Rao garu.
***
Surreal & large… @DirKrish has painted the canvas with an out of the
world experience
ఇవీ ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా మీద సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్లు, కానీ మహానాయకుడు విడుదలకు ముందుకానీ, వెనుక కానీ నో ట్వీట్స్. సహజంగా మహేష్ బాబు ట్విట్టర్ లో కాస్త లిబరల్ గా వుంటారు. చకచకా ట్వీట్లు వేస్తుంటారు. వాటి విషయంలో కాస్త మొహమాటాలు కూడా ఎక్కువ. అలాంటి మహేష్ బాబు మహానాయకుడు సినిమా మీద ఒక్క ట్వీట్ వేయలేదు. మహానాయకుడు ట్రయిలర్ రీ ట్వీట్ చేయలేదు. అంటే మహానాయకుడు నచ్చకనా? లేక కథానాయకుడు పై ట్వీట్లు, ఆ తరువాత సినిమా ఫలితం తెలిసి ముందే జాగ్రత్తపడ్డారా?