ఎ టీవీ మూవీ చానెల్ రెడీ

నిర్మాత అనిల్ సుంకర స్వంత ఛానెల్ ఏ టీవీ. తెలుగులో వన్ అండ్ ఓన్లీ ఎడ్యుకేషన్ ఛానెల్. కానీ అంతగా క్లిక్ కాలేదు. కానీ లైసెన్స్ అలాగే వుంది. ఇప్పుడు దీన్ని మళ్లీ స్టార్ట్…

నిర్మాత అనిల్ సుంకర స్వంత ఛానెల్ ఏ టీవీ. తెలుగులో వన్ అండ్ ఓన్లీ ఎడ్యుకేషన్ ఛానెల్. కానీ అంతగా క్లిక్ కాలేదు. కానీ లైసెన్స్ అలాగే వుంది. ఇప్పుడు దీన్ని మళ్లీ స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఎడ్యుకేషన్ కన్నా జనాలకు సినిమాలే ఎక్కువ ఇంట్రస్ట్ అని గమనించినట్లున్నారు. ఫుల్ టైమ్ మూవీ న్యూస్ రిలేటెడ్ ఛానెల్ గా మార్చి, మళ్లీ ప్రారంభిస్తున్నారు.

రోజంతా సినిమా న్యూస్, సినిమా ఇంటర్వూలు, సినిమా ప్రోగ్రామ్ లు, సినిమా పాటలు, సినిమాలు, ఇలా మొత్తంమీద సినిమా.. సినిమా.. సినిమానే వుంటాయన్నమాట. ఉగాదికి ఈ ఛానెల్ అందరికీ దర్శనమిస్తుంది. కానీ ఈరోజు ముహుర్తం కోసం టెస్ట్ సిగ్నల్ ను ప్రారంభించారు.

ఇటీవలే ప్రవాస భారతీయులు, పల్స్ తెలుగువారి కోసం ఆన్ లైన్ రేడియోను అనిల్ సుంకర ప్రారంభించారు. అది సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంటడంతో, ఇప్పుడు చానెల్ ను తిరిగి ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నారు.

పేరుకి ఎన్టీఆర్‌ బయోపిక్‌ కానీ… రెండు భాగాలు

ప్రజారాజ్యం కన్నా పేలవంగా ముగింపు?