ఇప్పుడు రెజీనా దూరమైందా?

ఆ మధ్య రెజీనా మీద ఒకటే గ్యాసిప్ లు..మెగా హీరోలతో మా చనువుగా మసలుతోందని. దానికి తగ్గట్టే మెగా హీరోలతో సినిమాలు చేసింది. అయితే, ఇప్పుడు మెగా హీరోలకు రెజీనా దూరంగా వుంటోందని టాక్.…

ఆ మధ్య రెజీనా మీద ఒకటే గ్యాసిప్ లు..మెగా హీరోలతో మా చనువుగా మసలుతోందని. దానికి తగ్గట్టే మెగా హీరోలతో సినిమాలు చేసింది. అయితే, ఇప్పుడు మెగా హీరోలకు రెజీనా దూరంగా వుంటోందని టాక్. లేదు..మెగా హీరోలే దూరం పెట్టారని మరో టాక్. ఏదయితేనేం..రెజీనాకు, మెగా హీరోలకు మధ్య ఇప్పుడు అంతగా ఫ్రెండ్ షిప్ లేదన్నది ఇండస్ట్రీ గ్యాసిప్ ల సారాంశం.

రెజీనా కు ప్రస్తుతం చేతిలో ఒకటి రెండు సినిమాలే వున్నాయి. పైగా తన కెరీర్ ను ఎలా గాడిలో పెట్టుకోవాలా అని కిందా మీదా పడుతోంది. దాని కోసం, తను థర్టీ ఫ్లస్ అయినా, అందాల ప్రదర్శనుకు లోటేంలేదని చాటే ప్రయత్నాలు వీలయినపుడల్లా చేస్తోంది. అప్పుడప్పుడు ఇలాంటి ఫీలర్లు కూడా బయటకు వస్తున్నాయి. 

కృష్ణవంశీ..బికినీ సంగతి ఇలాంటిదే. అందం.. అభినయం కలిసిన హీరోయిన్ల కొరత అయితే టాలీవుడ్ కు వుంది. మరి అయినా కూడా రెజీనాకు ఛాన్స్ లు ఎందుకు రావడంలేదో.. రెజీనాకు కాలం కలిసి రావడం లేదో? లేక సినిమాలకు రెజీనా కలిసి రావడంలేదో?