Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

హే.. భలే జోక్కేస్సారు..

హే.. భలే జోక్కేస్సారు..

మొదటి దానికి మొగుడు లేడు.. కడదానికి కళ్యాణం అని సామెత. అలాగే వుంది, ఈ వ్యవహారం చూస్తుంటే. ఒక మనసు సినిమా వ్యవహారం తేలనే లేదు. మధుర శ్రీధర్ చెదిరిపోయిన తన కలల నుంచి ఇంకా తేరుకోలేదు.. ఒక మనసు శాటిలైట్ అయితే గానీ గట్టెక్కే పరిస్థితి లేదు. అదే టీమ్ తో మరో సినిమా అని వార్తలు. పైగా రామరాజే దర్శకుడు.. చీకటిప్రేమ అని టైటిల్. 

రామరాజు మంచి డైరక్టర్. అందులో సందేహం లేదు. కానీ కమర్షియల్ వ్యవహారాలు ఆయనకు అణుమాత్రం పట్టవని ఒక మనసు సినిమా ప్రూవ్ చేసింది. మెగా ఫ్యామిలీ హీరోయిన్ ను, టీవీ 9 లాంటి ప్రొడక్షన్ హవుస్ ను తోడు తీసుకుని కూడా కాస్తయినా కమర్షియల్ టచ్ లు చూసుకోకుండా సినిమా తీసినపుడే ఆ సంగతి అర్థమైపోయింది. మరి పీకలలోతు నష్టాలు చవి చూసి, కలలు చెదిరిపోయిన మధుర శ్రీధర్, తనకు ఎంత గౌరవం, అభిమానం వుంటే మాత్రం, మళ్లీ అదే రామరాజుతో సినిమా చేస్తారా? లేక, కమర్షియల్ గా తనను బెయిలవుట్ చేస్తారనే గ్యారంటీ వున్న డైరక్టర్ తో సినిమా చేస్తారా? సింపుల్ లాజిక్ కదా? 

లేదా పోయిన చోటే వెదుక్కోవాలని, లేదా బై వన్ గెట్ వన్ లాగా రామరాజుతో సినిమా చేస్తారా? అయినా మళ్లీ చీకటి ప్రేమ అనగానే అర్థం అయిపోతోంది..మరో నికార్సయిన ప్రేమ కథ అని. అలాంటివి ఎవరికీ అక్కర్లేదని ఒక మనసు ప్రూవ్ చేసింది కదా? పైగా చీకటి ప్రేమ అంటున్నారు..కొంపదీసి జ్యోతిలక్ష్మి మాదిరిగా ‘ఆ తరహా’ జనాల కథ కాదు కదా..అయినా ఓ సినిమా సరిగ్గా ఆడనపుడు..అదే టీమ్ మరో సినిమా చేస్తుందని ఫీలర్లు వదలడం ఏమో ఇదంతా..అంతవరకు అయితే ఓకె. జోక్ గా తీసుకోవచ్చు..సీరియస్ అనుకుంటే, మధుర శ్రీధర్ ధైర్యానికి మెచ్చుకోవాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?