అక్కినేని నాగార్జున, తన ఇంట్లో రెండు లవ్ స్టోరీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. పుత్రరత్నాలు నాగచైతన్య, అఖిల్ కెరీర్‌లో ఇంకా సెటిలవకపోయినా, లైఫ్‌లో సెటిలైపోయేందుకు అన్ని ఏర్పాట్లూ చేసుకోవడంతో నాగార్జున ఇక 'నో' చెప్పడానికి వీల్లేని పరిస్థితి. ఇంకోపక్క పెళ్ళి చేసుకున్న తర్వాత హీరోలు హిట్లు మీద హిట్లు కొడుతున్న ట్రెండ్ టాలీవుడ్‌లో కన్పిస్తోంది. దాంతో, నాగార్జున, తన ఇంట్లో 'పెళ్ళి సందడి' కోసం ఆశపడ్డంలో వింతేముంది.?
ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రేమ పెళ్ళిళ్ళే కనిపిస్తున్నాయి. టాలీవుడ్‌లో ఇవి మరీ ఎక్కువగా వుంటున్నాయి. సో, పిల్లల ప్రేమల్ని గౌరవించడం పెద్దలుగా తమ బాధ్యత.. అని సినీ ప్రముఖుల్లో చాలామంది డిసైడ్ అయిపోయారు. ఈ మధ్య జరిగిన సినీ పెళ్ళిళ్ళలో చాలావరకు ప్రేమను పెద్దలు అంగీకరించడం ద్వారా జరిగినవే.
సో, నాగార్జున ఇక్కడ అభ్యంతరం చెప్పడానికేమీ లేదు. అతి త్వరలో.. అంటే వచ్చే నెలలోనే అక్కినేని నాగార్జున ఇంట్లో వరుస శుభకార్యాలు జరగనున్నాయని తెలుస్తోంది. నాగార్జున కూడా తనకు అత్యంత సన్నిహితులైనవారితో నాగచైతన్య, అఖిల్‌ల ప్రేమ సంగతుల గురించి చెప్పుకుంటూ మురిసిపోతున్నాడట. నాగచైతన్య, తన కో-స్టార్ సమంతతో లవ్‌లో పడితే, అఖిల్ తనకు గత కొంతకాలంగా పరిచయం వున్న ఓ వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన అమ్మాయతో ప్రేమలో పడ్డ విషయం విదితమే.