పవన్‌కి నాగ్‌ భయపడ్డాడా?

భాయ్‌ ట్రైలర్‌ గుర్తుందా.?  గబ్బర్‌ సింగ్‌లో పవన్‌ కల్యాణ్‌ వేసిన ట్రెండ్‌ డైలాగ్‌కు సెటైర్‌ వేశాడు భాయ్‌. ఎవడెవడో ట్రెండ్‌ని సెట్‌ చేశాం అని చెబుతున్నారు.. అసలు ట్రెండ్‌ని సృష్టించింది నేనే – అంటూ…

భాయ్‌ ట్రైలర్‌ గుర్తుందా.?  గబ్బర్‌ సింగ్‌లో పవన్‌ కల్యాణ్‌ వేసిన ట్రెండ్‌ డైలాగ్‌కు సెటైర్‌ వేశాడు భాయ్‌. ఎవడెవడో ట్రెండ్‌ని సెట్‌ చేశాం అని చెబుతున్నారు.. అసలు ట్రెండ్‌ని సృష్టించింది నేనే – అంటూ నాగ్‌ కాలర్‌ ఎగరేయడం ఆ డైలాగ్‌ వెనుక ఉన్న ఆంతర్యం.

అది వవన్‌కి ఉద్దేశించిందే అనే విషయం అందరికీ తెలిసిందే. పవన్‌ ని వాడుకొని సినిమాకి నాగ్‌ ప్రచారం చేసుకొంటున్నాడు అని కూడా అన్నారు. కానీ ఆ డైలాగ్‌ సినిమాలో లేదు. పవన్‌ ఫ్యాన్స్‌ జోరుకి నాగ్‌ భయపడ్డాడా..?  లేదంటే ఎందుకొచ్చిన గొడవ అని ఆ డైలాగ్‌ని పక్కన పెట్టాడా?  అనేది ఆసక్తికరం. 

మొత్తమ్మీద భాయ్‌లో పవన్‌ పై సెటైర్‌ డైలాగ్‌ లేకపోవడంతో పవన్‌ ఫ్యాన్స్‌ – లైట్‌ తీసుకొన్నారు. లేదంటే ఏం చేద్దురో..?