cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అన‌న్య‌కు అండ‌గా యంగ్ హీరో!

అన‌న్య‌కు అండ‌గా యంగ్ హీరో!

డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో ఎన్సీబీ విచార‌ణ‌ను ఎదుర్కొంటున్న బాలీవుడ్ వ‌ర్త‌మాన న‌టి అన‌న్య పాండేకు అండ‌గా నిలుస్తున్నాడ‌ట ఒక యంగ్ హీరో. అత‌డూ వ‌ర్త‌మాన న‌టుడే... ఇషాన్ ఖ‌ట్ట‌ర్. 

శ్రీదేవి త‌న‌య బాలీవుడ్ ఎంట్రీ సినిమాతో తెర‌కు ప‌రిచ‌యం అయిన ఇషాన్ ఖ‌ట్ట‌ర్.. అన‌న్య‌ను ఓదారుస్తున్నాడ‌ట‌. ఆర్య‌న్ అరెస్టు త‌ర్వాత డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో ఆమె పేరు వినిపించ‌గానే, ఇషాన్ ఆమె ఇంటికి చేరుకుని, అండ‌గా నిలుస్తూ ఉన్నాడ‌ట‌. 

ఇప్ప‌టికే అన‌న్య ఒక‌సారి ఎన్సీబీ విచార‌ణ‌కు హాజ‌రైంది. అయితే రెండో సారి ఆమె విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సి ఉన్నా.. కాలేదు. త‌న‌కు వేరే ప‌నులు ఉన్నాయ‌ని, మ‌రో రోజు త‌ను హాజ‌ర‌వుతానంటూ ఆమె ఎన్సీబీకి స‌మాచారం ఇచ్చిందట‌.

ఈ నేప‌థ్యంలో ఎన్సీబీ కూడా ఆమెకు ఆ మేర‌కు అనుమ‌తులు ఇచ్చిన‌ట్టుగా ఉంది. మ‌రోసారి పిలుస్తామ‌ని ఎన్సీబీ అధికారులు కూడా ఆమెకు మిన‌హాయింపును ఇచ్చిన‌ట్టుగా స‌మాచారం. 

ఇక గ‌త కొన్నాళ్లుగా అన‌న్య‌, ఇషాన్ లు రిలేష‌న్షిప్ లో ఉన్నార‌నే టాక్ ఉంది. వీరిద్ద‌రూ బాగా డేటింగ్ లో ఉన్నార‌ని, ఈ క్ర‌మంలోనే డ్ర‌గ్స్ కేసులో అన‌న్య పాండే చిక్కుకుంటోంద‌నే టాక్ నేప‌థ్యంలో ఆమెకు ఇషాన్ మ‌ద్ద‌తుగా నిలుస్తున్నాడ‌ని బాలీవుడ్ టాక్.

హీరోలు దేవుళ్లా ఏందీ?

జగన్: దూకుడే.. ముందుచూపు ఏదీ?!