ఒకవైపు ఆయన తనయుడు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు. మరోవైపు టీవీలో పిల్లల చదువుకు సంబంధించిన మొబైల్ యాప్స్ యాడ్స్ లో షారూక్ వరసగా వస్తూ ఉంటాడు. సొంత తనయుడు పక్కదారి పట్టకుండా కాపాడుకోలేకపోయిన షారూక్, ఇలా దేశంలోని పిల్లలందరి విషయంలో ఒక యాప్ ప్రమోటర్ గా ఉండటం విడ్డూరమైన అంశం!
రకరకాల వేషాల్లో ఆ యాప్ యాడ్ లో షారూక్ సలహాలు ఇస్తూ ఉంటాడు. అవన్నీ పిల్లల పై దృష్టి పెట్టే తండ్రి వేషాలే. అయితే నిజ జీవితంలో మాత్రం షారూక్ తన పిల్లాడు పక్కదారి పట్టకుండా కాపాడుకోలేకపోయాడనే కామెంట్ చాలా ఈజీగా వినిపించే అవకాశం ఉంది.
కామెంట్ చేయడం తేలికే కాబట్టి.. ఒకవైపు షారూక్ తనయుడు డ్రగ్స్ కేసులో జైల్లో, మరోవైపు యాడ్స్ లో షారూక్ కనిపిస్తున్న నేపథ్యంలో.. ఈ చర్చ సహజంగానే జరుగుతుంది. ఇదే అంతిమంగా షారూక్ ఖాన్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీస్తుంది.
టీవీలో యాడ్స్ చూసే వాళ్లే ఇవన్నీ ఆలోచిస్తారు. అలాంటిది కోట్ల రూపాయలు చెల్లించి షారూక్ తో యాడ్స్ చేయించుకునే వాళ్లు కూడా ఈ లెక్కలన్నీ వేస్తారని వేరే చెప్పనక్కర్లేదు. ఆ మధ్య తన భర్త పోర్న్ వ్యవహారంలో చిక్కుకోవడంతో శిల్పా షెట్టి యాడ్స్ ను ఆపేయించుకున్నాయట కొన్ని సంస్థలు.
చిన్న పిల్లల ప్రోడక్ట్స్ కు సంబంధించి శిల్ప పలు యాడ్ లలో కనిపించేది. రాజ్ కుంద్రా పోర్న వ్యవహారంలో అరెస్టు కావడంతో అలాంటి యాడ్స్ కొన్ని అర్థాంతరంగా ఆగిపోయాయి. శిల్పతో ఆ సంస్థలు ఒప్పందాలను కూడా రద్దు చేసుకున్నాయనే టాక్ వచ్చింది. పోర్న్ తో రాజ్ సంపాదించిన దాని కన్నా.. అతడు అరెస్టు కావడంతో శిల్ప బ్రాండ్ ఇమేజ్ కు జరిగిన నష్టం ఎక్కువనే టాక్ కూడా వచ్చింది.
ఇప్పుడు తన తనయుడు అరెస్టు కావడంతో షారూక్ బ్రాండ్ ఇమేజ్ కు కూడా దెబ్బ పడవచ్చు. ఆర్యన్ అరెస్టు కావడంతో షారూక్ కనిపించే పాన్ పరాగ్ యాడ్ కు నష్టం ఉండదు. అయితే పిల్లల చదువుకు సంబంధించిన ఒక యాప్ కు షారూక్ ప్రధాన అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. క్రికెట్ మ్యాచ్ ల సందర్భాల్లో ఆ యాడ్ లెక్కలేనన్ని సార్లు వస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో షారూక్ తనయుడు వీక్షకులకు గుర్తుకు రావొచ్చు.
ప్రస్తుతానికి అలాంటి యాడ్స్ ప్రసారం తప్పక చేస్తూ ఉండవచ్చు. కానీ.. ఇలాంటి ఒప్పందాల విషయంలో.. షారూక్ నష్టం ఉండవచ్చు! సెలబ్రిటీలకు సంబంధించి ప్రతీదీ ఆర్థిక వ్యవహారాలోనే ముడిపడి ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు.