ఐటెమ్‌గాళ్‌గా స‌మంత‌??

అల్లుడు శీను కోసం త‌మ‌న్నా ఐటెమ్ గాళ్‌గా మారిపోయింది. ఇప్పుడు స‌మంత కూడా హాట్ పాట‌లో క‌నిపించ‌నుందా…??  ఓ చిన్న సినిమాలో ఐటెమ్ గీతంలో మురిపించ‌నుందా..??   ఈప్రశ్నకు అవును అనే స‌మాధానాలే వినిపిస్తున్నాయి.…

అల్లుడు శీను కోసం త‌మ‌న్నా ఐటెమ్ గాళ్‌గా మారిపోయింది. ఇప్పుడు స‌మంత కూడా హాట్ పాట‌లో క‌నిపించ‌నుందా…??  ఓ చిన్న సినిమాలో ఐటెమ్ గీతంలో మురిపించ‌నుందా..??   ఈప్రశ్నకు అవును అనే స‌మాధానాలే వినిపిస్తున్నాయి. అంజ‌లి ప్రధాన పాత్రలో న‌టించిన చిత్రం గీతాంజ‌లి. కోన వెంక‌ట్ ఈ చిత్రానికి నిర్మాణ భాగ‌స్వామి. 

ఈ సినిమాలో ఎగ‌స్ట్రా పెప్ జోడించాల‌ని కోన భావిస్తున్నాడు. త‌న‌కు ఎంతో స‌న్నిహితురాలైన స‌మంత‌తో ఆ పాట చేయించాల‌ని డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది. కోన వెంక‌ట్ కోసం ఈ సినిమాలో పాట చేయ‌డానికి స‌మంత కూడా చూచాయిగా అంగీక‌రించింద‌ట‌. త‌న వీలును బ‌ట్టి ఈ పాట‌లో న‌ర్తిస్తాన‌ని మాటిచ్చింద‌ట‌. 

కోన వెంక‌ట్ సోద‌రి, నీర‌జా కోన‌… స‌మంత‌కు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా వ్యవ‌హ‌రిస్తోంది. నీర‌జ అంటే స‌మంత‌కు ప్రత్యేక‌మైన అభిమానం. ఆ ఇష్టంతోనే ఈ పాట‌లో నటించ‌డానికి ముందుకొచ్చింద‌ట‌. కోన వెంక‌ట్ కూడా `ఈ సినిమాలో ఓ అగ్ర తార ఐటెమ్ పాట చేయ‌బోతోంది. ఆమె పేరు త్వర‌లో ప్రక‌టిస్తాం..` అని మీడియా ముఖంగా చెప్పారు. ఆ నాయిక స‌మంతే అని టాక్‌.