బూతు సినిమాల్లో నటించినప్పుడు ఏమీ అన్పించలేదుగానీ.. చిన్న పిల్లల ముందు ఓ ఐటమ్ సాంగ్ చేయడానికి మాత్రం తెగ ఇబ్బంది పడిపోయిందట సన్నీలియోన్. నమ్మొచ్చా.? నమ్మాల్సిందేనంటున్నారు ఆమెతో ఐటమ్ సాంగ్ చేయిస్తోన్న ‘హేట్ స్టోరీ`2’ సినిమా యూనిట్ సభ్యులు. షూటింగ్‌కి రెడీ అవుతుండగా, అక్కడ పదేళ్ళ వయసు లోపు పిల్లలు చాలామంది వుండడం చూసి కాస్తంత ఇబ్బందిగా ఫీలయ్యిన సన్నీలియోన్, ‘వారందర్నీ వెంటనే పంపించెయ్యండి..’ అంటూ యూనిట్ సభ్యులకు హుకూం జారీ చేసిందట.
‘చేస్తున్నది ఐటమ్ సాంగ్.. పిల్లలు అలాంటివి చూస్తే ఎలా.? నాకు మాత్రం చిన్న పిల్లల ముందు నటించాలంటే చాలా ఇబ్బందిగా వుంటుంది..’ అంటూ యూనిట్ సభ్యులకు తన ఇబ్బందిని తెలియజేసింది సన్నీలియోన్. దాంతో ఒక్కసారిగా యూనిట్ సిబ్బంది షాక్‌కి గురయ్యారు. ఇప్పటిదాకా తాము ఎప్పుడూ ఇలాంటి మాటల్ని ఏ నటి నుంచీ వినలేదని చెబుతున్నారు వారంతా.
అయితే, సన్నీలియోన్ భర్త డేనియల్ వెబర్ మాత్రం, సన్నీలియోన్‌కి షూటింగ్ స్పాట్ సింపుల్‌గా వుంటే ఇష్టమనీ, పోర్న్ సినిమాలు నిర్మిస్తున్నప్పుడు నిర్మాతగా ఏనాడూ షూటింగ్ స్పాట్‌లో ఎక్కువమందిని సన్నీలియోన్ వుండనివ్వలేదని చెప్పుకొచ్చాడు. పోర్న్ సినిమాలంటే, అవి ఎక్కువమంది ముందు షూటింగ్ చేయరు కదా. అయినా, చిన్న పిల్లలు చూస్తున్నప్పుడు డాన్స్ చేయడానికే ఇబ్బంది పడే సన్నీలియోన్, ఇంటర్నెట్‌లో తన బూతు సినిమాల్ని చూసే చిన్న పిల్లల గురించి అప్పట్లో ఆలోచించి వుంటే అసలు పోర్న్ సినిమాలే చేసేది కాదేమో.!