జబర్దస్త్ కు ‘షకలక’ గుడ్ బై?

షకలకశంకర్ పాపులర్ అయింది జబర్దస్త్ షో నుంచి. సినిమాల్లో బిజీ అయ్యాక, హీరోగా మారాక జబర్ధస్త్ షోలు తగ్గించారు. అయితే ఇటీవల జబర్దస్త్ నుంచి నాగబాబు తప్పుకున్నాక, చాలా మార్పులు జరిగాయి. ఆ మార్పుల్లో…

షకలకశంకర్ పాపులర్ అయింది జబర్దస్త్ షో నుంచి. సినిమాల్లో బిజీ అయ్యాక, హీరోగా మారాక జబర్ధస్త్ షోలు తగ్గించారు. అయితే ఇటీవల జబర్దస్త్ నుంచి నాగబాబు తప్పుకున్నాక, చాలా మార్పులు జరిగాయి. ఆ మార్పుల్లో భాగంగా షకలకశంకర్ మళ్లీ జబర్ధస్త్ లో ఎంట్రీ ఇచ్చారు. కానీ లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే, మళ్లీ అక్కడ నుంచి తప్పుకుంటున్నారని.

పది ఎపిసోడ్ ల వరకు చేసారు. కానీ కొన్ని కారణాల వల్ల తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. తన స్కిట్ ను, ఎపిసోడ్ లో లాస్ట్ స్కిట్ గా, అయిదో స్కిట్ గా వేస్తున్నారని శంకర్ కు అసంతృప్తి వునట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే యూ ట్యూబ్ లో మిగిలిన స్కిట్ లతో పోల్చుకుంటే సరైన రెస్పాన్స్ రావడం లేదని, రెమ్యూనిరేషన్ కూడా సంతృప్తికరంగా లేదని టాక్ వుంది.

మొత్తం మీద మళ్లీ జబర్దస్త్ స్టేజ్ ను షకలక శంకర్ వదిలేస్తన్నట్లు బోగట్టా. ఆయన హీరోగానే తన ప్రయాణం కొనసాగిస్తూ ఒకటి, రెండు చిన్న సినిమాలకు సైన్ చేసినట్లు తెలుస్తోంది.

V కథను పవన్-మహేష్ ను దృష్టిలో పెట్టుకొని రాయలేదు