హరీష్ శంకర్ – వేదాంత రాఘవయ్య

అలనాటి సినిమా ప్రముఖుడు వేదాంతం రాఘవయ్య పేరుతో సినిమా రాబోతోంది. అయితే ఇదేమీ బయోపిక్ కాదు. అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా. ఈ సినిమాలో హీరో సునీల్ …అంటేనే అర్థం అయిపోతుంది పక్కా…

అలనాటి సినిమా ప్రముఖుడు వేదాంతం రాఘవయ్య పేరుతో సినిమా రాబోతోంది. అయితే ఇదేమీ బయోపిక్ కాదు. అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా. ఈ సినిమాలో హీరో సునీల్ …అంటేనే అర్థం అయిపోతుంది పక్కా ఫన్ అండ్ ఎంటర్ టైనర్ అని. ఇలాంటి సినిమాకు కథ మాటలు అందిస్తున్నది మాస్ పల్స్ తెలిసిన డైరక్టర్ హరీష్ శంకర్.

14రీల్స్ ప్లస్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తారు. డైరక్టర్ ఎవరు అన్నది ఇంకా ఫిక్స్ కాలేదు. హరీష్ శంకర్ తన శిష్యుల్లో ఒకరిని పరిచయం చేసే అవకాశం వుంది. ఈ రోజు మంచి రోజు అని సినిమాను ప్రకటించారు. త్వరలో అన్నీ ఫిక్స్ అయిన తరువాత మరిన్ని వివరాలు అందిస్తారు.

హరీష్ శంకర్ తో కలిసి 14రీల్స్ ప్లస్ పతాకంపై వాల్మీకి నిర్మించారు. ఇది మళ్లీ అదే కాంబినేషన్లో మరో సినిమా.

V కథను పవన్-మహేష్ ను దృష్టిలో పెట్టుకొని రాయలేదు